Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో పోలీసు కుటుంబ సభ్యుల ఆందోళన

చెన్నైలో పోలీసు కుటుంబ సభ్యుల ఆందోళన
మద్రాసు హైకోర్టు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడులకు దిగిన న్యాయవాదులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు కుటుంబాలకు చెందిన వందలాది మంది సభ్యులు ఆందోళన నిర్వహించారు. స్థానిక చెప్పాక్కంలోని ప్రభుత్వ అతిథి గృహం ఎదుట సోమవారం ఈ ధర్నా జరిగింది. పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు సుమారు ఐదు వందల మందికిపైగా పాల్గొన్నారు. దీనికి మాజీ పోలీసు ఉన్నతాధికారులు, పలువురు పోలీసు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ కమిషనర్ (రిటైర్డ్) అంటోనీ సామీ మాట్లాడుతూ, సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకు ఏ ఒక్క పోలీసుపై చర్య తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గత నెల 19వ తేదీన హైకోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో న్యాయవాదులు, పోలీసులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న విషయం తెల్సిందే.

దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. జస్టీస్ బీఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు రోజుల పాటు హైకోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి, ఆదివారంతో విచారణ ముగించింది. మరో వారంలో తుది నివేదికను సుప్రీం కోర్టుకు కమిటీ సమర్పించనుంది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. కాగా, ఆందోళనలో పాల్గొన్న పోలీసు కుటుంబ సభ్యులు పలువురు న్యాయవాదులకు కల్పించిన పోలీసు భద్రతను తక్షణ ఉపసంహరించాలన్నారు. తమ భర్తలకు న్యాయవాదుల ఇళ్ళలో రక్షణ లేనపుడు, వారికెందుకు భద్రత కల్పించాలని వారు ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu