Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గజదొంగను ప్రేమించిన కానిస్టేబుల్ కుమార్తె : పెళ్లి జరిగిందా?

గజదొంగను ప్రేమించిన కానిస్టేబుల్ కుమార్తె : పెళ్లి జరిగిందా?
File
FILE
ఎక్కడైనా.. పోలీసులంటే దొంగలకు హడల్. కానీ, రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రకర సంఘటన తాజాగా చోటు చేసుకుంది. కొంతమంది అకతాయిల చేతుల్లో చిక్కిన తన కుమార్తెను రక్షించేందుకు ఓ హెడ్ కానిస్టేబుల్ గజదొంగ సాయం కోరాడు.

తమ ఇద్దరి మధ్య ఉన్న లావాదేవీల కారణంగా హెడ్ కానిస్టేబుల్ మాటను గజదొంగ కాదనలేక పోయాడు. ఆ గజదొంగ అల్లరి మూకల నుంచి పోలీసు కుమార్తెను రక్షించాడు. ఇక్కడ నుంచే అసలు సమస్య ఉత్పన్నమైంది.

అల్లరి మూకల నుంచి తనను కాపాడిన గజదొంగ సాహసానికి మనస్సు కరిగిపోయిన పోలీసు కుమార్తె.. గజదొంగను ప్రేమించింది. దీనికి దొంగ కూడా సై అన్నాడు. ఈ విషయం మెల్లగా హెడ్ కానిస్టేబుల్ దృష్టికి వెళ్లింది.

ఏ తండ్రైనా తన కుమార్తెను ఓ గజదొంగకు ఇస్తారా? ఇక్కడా ఇదే జరిగింది. తన కుమార్తెను గజదొంగకు ఇచ్చి పెళ్లి చేసేందుకు కానిస్టేబుల్ ససేమిరా అన్నారు. అయితే, గజదొంగకు తన మనస్సును సమర్పించుకున్న ఆ ప్రేమికురాలు.. అన్నపానీయాలు మాని మౌనపోరాటం చేసింది. దీంతో తల్లిదండ్రులు దిగివచ్చి గజదొంగను తన ఇంటి అల్లుడిగా చేసుకోక తప్పలేదు.

ఈ గజదొంగ ఇటీవల పెరోల్‌పై విడుదలైన తర్వాత గజదొంగతో పోలీసు కూతురు వివాహం చేశాడు. కాగా మళ్లీ దొంగతనాలు చేయనని, ఇకపై సమాజంలో గౌరవంగా సంసారం జీవితాన్ని సాగిస్తానని గజదొంగ భార్య, అత్తమామలకు హామీ ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu