Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహ్మదాబాద్ పేలుళ్లు : నిందితుల కోసం గాలింపు

అహ్మదాబాద్ పేలుళ్లు : నిందితుల కోసం గాలింపు
, మంగళవారం, 5 ఆగస్టు 2008 (16:51 IST)
అహ్మదాబాద్‌లో గత నెల 26న జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించిన సూత్రధారులను గుర్తించేందుకు అక్కడి క్రైం బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా గతంలో జైపూర్‌లో జరిగిన పేలుళ్లలకు సూత్రధారులుగా పేర్కొంటున్న ఏడుగురు ఊహా చిత్రాలను అహ్మదాబాద్ క్రైం పోలీసులు సిద్ధం చేశారు.

అహ్మదాబాద్‌లో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఏమైన ఉందా అన్న కోణంలో వీరు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై క్రైం బ్రాంచ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ తాము సంపాదించిన ఊహా చిత్రాలలోని వ్యక్తులకు అహ్మదాబాద్ పేలుళ్లతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ దర్యాప్తులో భాగంగా అవసరమైతే పేలుళ్ల ప్రధాన సాక్షులకు ఈ ఊహాచిత్రాలు చూపించి దర్యాప్తును వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. అహ్మదాబాద్ పేలుళ్లకు సంబంధించి క్రైం బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇదేసమయంలో సోమవారం అహ్మదాబాద్ పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది నగరంలోని 3,000 వాహనాలు, 11 హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, 30 పబ్లిక్ గార్డెన్లు, 42 ఆధ్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా దాదాపు 155 మంది పోలీసులు ప్రశ్నించారు.

అహ్మదాబాద్‌లో గత నెల 26న వరస పేలుళ్లు సంభవించిన తర్వాత ఇప్పటివరకు 24 పేలుడు పదార్ధాలను కనుగొన్న పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu