Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుస్తకంపై నిషేధం ఎత్తివేత: జశ్వంత్ హర్షం

పుస్తకంపై నిషేధం ఎత్తివేత: జశ్వంత్ హర్షం
గుజరాత్ హైకోర్టు శుక్రవారం రాష్ట్రంలో తాను రాసిన "జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం" పుస్తకంపై నిషేధం ఎత్తివేయడం పట్ల బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జశ్వంత్ సింగ్ జిన్నాపై రాసిన వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నిషేధం ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ గుజరాత్ హైకోర్టు నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జశ్వంత్ సింగ్ మాట్లాడుతూ తాజా కోర్టు తీర్పు సంతృప్తికరంగా ఉందన్నారు. తన పుస్తకంపై నిషేధం ఎత్తివేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యంగం కల్పించిన భావ ప్రకటన హక్కును కోర్టు కాపాడిందన్నారు.

మనమందరం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం పుస్తకాన్ని నిషేధించేందుకు దేనిని ప్రాతిపదికగా తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం వివరించలేదని, అందువలన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

Share this Story:

Follow Webdunia telugu