Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిమగిరుల లోగిలిలో ముస్సోరీ

హిమగిరుల లోగిలిలో ముస్సోరీ
, బుధవారం, 2 ఏప్రియల్ 2008 (14:24 IST)
FileFILE
ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే అందమైన పచ్చని కొండలు. వాటిని ముద్దాడుతున్నాయా అనిపించేట్లు వెళ్లే నీలి మేఘాలు చూడగానే మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అందానికి పెట్టింది పేరుగా ఉన్న హిమగురుల లోగిళ్లలో ఉన్న ప్రాంతం ముస్సోరీ. దీనినే క్వీన్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్‌గా పిలుస్తుంటారు. పచ్చని హిమగిరుల నుంచి 2,500 మీటర్ల ఎత్తులో ముస్సోరీ ప్రాంతం ఉంది. చల్లని గాలులు వీస్తూ వేసవి తాపాన్ని పోగొట్టే ఈ కొండలు చక్కని హాలిడే స్పాట్.

దేశ ఉత్తర ప్రాంతంలోని కొండలలో ప్రఖ్యాతి గాంచిన హిల్ స్టేషన్‌గా ముస్సోరీని చెప్పుకోవచ్చు. చుట్టు ప్రక్కల కొండలపై నిర్మించిన ఆధునిక బంగ్లాలు, చిరుతిండ్ల కొట్లు, క్రమబద్ధంగా పెంచిన తోటలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ఈ ప్రాంతానికి ప్రజలు వేసవి ప్రారంభం కాగానే విచ్చేస్తుంటారు.

ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు వీలుంటుంది. అలాగే సెప్టెంబర్, నవంబర్ నెలల్లో వసంత కాలం కనుక ఇక్కడి పచ్చదనం చాలా అందంగా కనులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మంచు వీడి హిమగిరులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చలికాలంలో ఇక్కడి ప్రాంతాలు మంచుతో కప్పుబడిపోతాయి.

అలాగే దీనికి దగ్గర్లోనే హిందూ దేవాలయాలు కేదార్, బద్రీనాథ్‌లు కూడా ఉండడంతో కేదారేశ్వరుని దర్శించుకోవడానికి పర్యాటకులకు చాలా సులభంగా ఉంటుంది. ఇక షాపింగ్ విషయానికొస్తే ఇక్కడ చెక్కతో చేసిన అలంకరణ సామాగ్రి, బహుమతులకు మసూరీ ప్రసిద్ధి గాంచినది. ఈ ప్రాంతంలో ఇత్తడి విగ్రహాలు కూడా లభిస్తాయి.

ముస్సోరీకి 15 కి.మీ దూరంలో ఉన్న కెప్టీ జలపాతం చూడాల్సిన మరో అందమైన ప్రాంతం. 4,500 అడుగుల ఎత్తు నుంచి పడే ఈ జలపాతం ఐదు భాగాలుగా విడిపోయి ప్రవహిస్తుంది. ముస్సోరీకి 78 కి.మీ దూరంలో ఉన్న చక్రోతాలోని హనోల్ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతంగా చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu