Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతి ముద్దుబిడ్డ "కక్కబె"

ప్రకృతి ముద్దుబిడ్డ
, సోమవారం, 20 జులై 2009 (13:14 IST)
FileFILE
కాఫీ తోటలు.. ఏలకుల పరిమళాలు.. నారింజ పండ్ల తోటలు.. జలపాతాలు.. కొండలతో దోబూచులాడే మేఘాలు... పర్వతారోహకులకు అనువైన కొండలు.. ఇలాంటి చూడముచ్చటైన ప్రకృతి అందాలు ఆ ప్రాంతం సొంతం. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని 'కక్కబె' అనే గ్రామంలో ఈ రమణీయ దృశ్యాలు కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదండీ.. ఆసియా ఖండంలోనే అత్యధిక పరిమాణంలో తేనె ఉత్పత్తి అవుతున్న ప్రాంతంగా కూడా ఈ కక్కబెకు మరో రికార్డు ఉంది.

ఈ ప్రాంతం.. ఓ కుగ్రామం..
ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా తేనె తుట్టెలే దర్శనమిస్తాయి. దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతం ఓ కుగ్రామమైనప్పటికీ.. స్టార్ హోటళ్లు.. రిసార్టులు, రెస్టారెంట్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా సొంతం చేసుకుంది. కాఫీ తోటల్లో ఉన్న పురాతన బంగళాలు.. స్టే హోంలుగా రూపుదిద్దుకున్నాయి.

webdunia
FileFILE


కొడగు ప్రజల సంప్రదాయాలు.. ఆహారపు అలవాట్లు ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉండే కాఫీ తోటల్లో విహరిస్తూ.. రమణీయమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉంటే.. కాలం కరిగిపోవడం తెలియదని అంటారు సందర్శకులు. కాఫీ తోటలతో పాటు.. ఏలకుల తోటలు ఇక్కడ ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న తడియాండల్ కొండలు పర్వతారోహకులకు స్వర్గధామంగా ఉంటాయి.

ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో శిఖరం నుంచి చూస్తే అరేబియా సముద్రం ప్రత్యేక అందాలను సంతరించుకుందా అని
webdunia
FileFILE
అనిపిస్తుంది. కక్కబెకు సమీపంలో ఉన్న సల్నాడ్ రాజప్రాసాదం మరో ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని పాలించిన దొడ్డవీరరాజు ఈ రాజప్రాసాదాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నాటి ఈ ప్యాలెస్‌ను చూసేందుకు పర్యాటకులు పోటీ పడుతుంటారు.

ఎలా వెళ్లాలి?
బెంగళూరు, మైసూరు నగరాల నుంచి మడికెరెకు బస్సు సదుపాయం ఉంది. అక్కడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కక్కబె చేరుకోవచ్చు. ప్రైవేట్ బస్సులు, టాక్సీల సదుపాయం కూడా ఉంది. ఈ గ్రామంలో ఉన్న హోంస్టేలు, రిసార్టులు, హోటళ్లలో బస చేసేందుకు రోజుకు వెయ్యి నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu