Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

523 సింహాల మధ్య ఒకే ఒక్క ఓటరు... ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రం

523 సింహాల మధ్య ఒకే ఒక్క ఓటరు... ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రం
, మంగళవారం, 7 మే 2019 (16:02 IST)
దేశంలో ఉన్న అభయారణ్యాల్లో గిర్ అరణ్యం ఒకటి. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ గిర్ అభయారణ్యంలో అన్ని క్రూరమృగాలే నివశిస్తాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ అరణ్యంలో 523 సింహాలు ఉన్నట్టు సమాచారం. వీటి మధ్య ఒకే ఒక ఓటరు నివశిస్తున్నాడు. ఆయన పేరు మహంత్ భారత్‌దాస్ గురుదర్శన్ దాస్. ఈయన బనేశ్వర్ మహాదేవ్ మందిర పూజారి. ఈయన ఇటీవల తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అతని కోసం ఎన్నికల కోసం ఓ పోలింగ్ కేంద్రానికి కూడా ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ కేంద్రంలో ఆయన ఒక్కరే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని సోమ్‌నాథ్ జిల్లా బానేజ్ గ్రామం పూర్తిగా గిర్ అభయారణ్యం మధ్య ఉంటుంది. ఈ గ్రామంలో ఒకే ఒక్క ఓటరు నివసిస్తున్నారు. ఆయన పేరు దర్శన్ దాస్. ఈ గ్రామంలోనే అత్యంత దట్టమైన అడవుల మధ్యలో బానేజ్ అనే ఒక చారిత్రక తీర్థయాత్ర ప్రదేశం ఉంది. ఈ తీర్థయాత్రా సంస్థలో దర్శన్ దాస్ పూజలు చేస్తుంటారు. ఈయన కోసమే ఓ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. నిజానికి ఈ అభయారణ్యంలో మనుషులెవ్వరూ నివశించరాదనే ఆంక్షలు ఉన్నాయి. కానీ బనేశ్వర్ మహాదేవ్ మందిర పూజారి మహంత్ భారత్‌దాస్ గురుదర్శన్ దాస్ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు. బానేజ్ గ్రామంలో ఈయన ఒక్కడే ఓటర్.
 
2002 తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం ఈ గ్రామంలో ఓటింగ్ కు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. మహంత్ తన ఓటు వేయడానికి ప్రతి ఎన్నికలకు బానేజ్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. మిగతా పోలింగ్ బూత్‌ల మాదిరిగానే బానేలో ఒక్క ఓటర్ కోసం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తారు. పోలింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు, ఒక చప్రాసీ, ఇద్దరు పోలీస్ సిబ్బంది. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ పోలింగ్ పూర్తయ్యే దాకా విధులు నిర్వహిస్తారు. వీవీప్యాట్, ఈవీఎం ఉపయోగించడం గురించి బానేజ్‌లో ఓటింగ్ ప్రక్రియను వివరించడం జరిగింది. 
 
ఎన్నికలకు ఒక రోజు ముందు అటవీ శాఖకి చెందిన గదిలో పోలింగ్ ఆఫీసర్ బస చేస్తారు. ఇది బనేశ్వర్ మందిరానికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గదిలోనే మర్నాడు పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లన్నీ కేవలం ఒక్క ఓటర్ మహంత్ భారత్ దాస్ కోసమే. తన కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడంపై భారత్ దాస్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 
 
'ఒక్క ఓటు కోసం ఎన్నికల సంఘం చేసే ఈ ప్రక్రియలో భాగం అవుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం' అని అన్నారు. 'మొత్తం దేశంలో ఎన్నికల సందర్భంగా 100 శాతం ఓట్లు పడాలని కోరుకుంటున్నాను. నేను అడవిలో ఉంటూ కూడా ఓటేస్తున్నట్టే అంతా ఓటేయాలి. 2002 నుంచి నేను ఇక్కడ ఓటు వేస్తున్నాను. నా కోసం పూర్తి పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశం తన ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తుందో దీనిని బట్టి అర్థం అవుతుంది' అని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం... తలుపు తీసి చూస్తే శవమై కనబడిన ప్రియుడు