Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహమంటే ఏనుగుకు ఎంత భయమంటే?

సింహమంటే ఏనుగుకు ఎంత భయమంటే?
, గురువారం, 20 నవంబరు 2014 (18:05 IST)
అడవిలో భారీ ఆకారంలో ఉండే ఏనుగు, ఎలుగుబంటి, ఖడ్గమృగం, జిరాఫీ వంటివి ఉన్నప్పటికీ ఒక్క సింహాన్నే అడవికి రాజని ఎందుకంటారో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. 
 
పురాతన ఈజిప్టియన్లు సింహాన్ని పవిత్రమైన జంతువుగా పూజించేవారు. సింహానికి ఉన్న బలాన్ని, శక్తిని దృష్టిలో పెట్టుకుని  కొన్ని పురస్కారాలు, మెమంటోల మీద సింహం ముఖాన్ని చిత్రించడం చేస్తారు. సింహం ఒకసారి ఏ జంతువు మీదికైనా దూకిందంటే.. ఇక దాన్ని ఆపడం, నిలువరించడం ఎవరి తరమూ కాదు. 
 
వీటికి నాయకత్వ లక్షణాలు బాగా ఎక్కువ. పరిమాణంలో దానికంటే ఎంత పెద్ద జంతువులైనా వేటాడి తినడానికి సింహం ఏమాత్రం జంకదు. పెద్ద పెద్ద జంతువుల్ని సింహాలు తమ బలమైన పళ్లతో చీల్చి, పదునైన పళ్లతో ముక్కలు చేసి తాపీగా ఆరగిస్తుంది. 
 
సింహాలు తరచు గుంపుగా తిరుగుతుంటాయి. సింహం సరాసరి పొడవు మూడు మీటర్లుంటే, బరువు 180-225 కేజీల వరకు వుంటుంది. ఆడ సింహాన్ని సివంగి అంటారు. వీటికి జూలు ఉండవు. చచ్చిన జంతువును కానీ, నక్కలు, తోడేళ్ల వంటి క్షుద్ర ప్రాణులు ముట్టిన జంతువును కానీ సింహం పొరపాటున కూడా ముట్టుకోదు.
 
ఏనుగులను సాధారణంగా ఏమీ చేయదు కానీ, ఏనుగులకే సింహాలంటే ఎంత భయమంటే.. కనీసం కలలో కనిపించినా, ఆ భయంతో అవి గుండె ఆగి చచ్చిపోతాయి. అందుకే సింహస్వప్నం అడవిరాజు అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu