Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలకు తల్లిదండ్రులు ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తున్నారా? లేదా?

పిల్లలకు తల్లిదండ్రులు ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తున్నారా? లేదా?
, మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (18:45 IST)
ఆధునికత పేరిట తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న ఫ్యామిలీస్‌తో పిల్లలతో ఆడుకునే తాతయ్యలు, బామ్మలు కరువవుతున్నారు. దానికితోడు చదువుతో ఒత్తిడి పెరగడం.. ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు అంటూ ఎన్నో విధాలా పిల్లలు ఒత్తిడికి గురైతే మాత్రం పెరిగే కొద్దీ వారిలో గుండె సంబంధిత వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
చిన్న పిల్లల జీవితం ఎంత ఆహ్లాదకరంగా ఉంటే అంత మంచిది. అది వారి భవిష్యత్తును అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పిల్లలకు ఒత్తిడిలేని జీవితాన్ని అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నతనంలో ఒత్తిడికి గురైన చిన్నారులకు తదనంతర కాలంలో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిక్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది.
 
ఈ పరిశోధన ప్రకారం, చిన్నతనంలో ఒత్తిడికి గురైన వారు 45 ఏళ్ల వయసు వచ్చే సరికి గుండె జబ్బులు, డయాబెటిస్ బారిన పడుతున్నారని హార్వర్డ్ యూనివర్శిటీ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం పరిశోధకుడు అశ్లీ విన్నింగ్ చెప్పుకొచ్చారు. మొత్తం 7వేల మందిపై పరిశోధనలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu