Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలం ఏం తినాలి? ఏం తినకూడదు?

వర్షాకాలం ఏం తినాలి? ఏం తినకూడదు?
, శుక్రవారం, 18 జులై 2014 (17:42 IST)
కాల ధర్మాన్ని అనుసరించి తినే ఆహార పదార్థాలలోను మార్పులు చేసుకుంటుండాలి. వర్షాకాలంలో సులువుగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున తీసుకునే ఆహారంలో మెలకువ అవసరం. ఎందుకంటే గాలిలో పెరిగిన తేమ శరీరంలో వేడిని పెంచుతుంది. వాతావరణ ప్రభావం వల్ల ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అంతేకాదు.. అంటువ్యాధులు ప్రబలి పోతుంటాయి. జీర్ణశక్తి బలహీనమవుతుంటుంది. 
 
అందుకే వానాకాలంలో కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది. అవేంటో ఒకసారి చూద్దాం... 
* ఎక్కువ నూనెతో తయారయ్యే వంటలు, 
* ఉప్పటి పదార్థాలు, 
* ఊరగాయలు, వేపుళ్లు, 
* వేరుశనగ, చింతపండు, చింతపండుతో చేసుకునే పచ్చళ్లు, 
* పనీర్, రైతా, నిల్వ పదార్థాలు, 
* లస్సీ, పుచ్చపండు వంటివి
* అధిక శ్రమతో కూడిన ఎక్సర్‌సైజ్ కూడదు. ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది. తద్వారా తలనొప్పి, ఒళ్లునొప్పులకి దారితీసే అవకాశం ఉంది. 
 
వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవలసిన ఆహారం:
* గోరువెచ్చని పాలు
* నిమ్మకాయ రసం చక్కెరతో కలిపి తీసుకోవాలి (తినే ముందు తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. మెదడుని చురుకుగా ఉంచుతుంది)
* రాజ్మ, జొన్న, తెల్ల సజ్జలు, ఓట్స్
* దోసకాయ చాలా మంచిది. ఇందులో ఫాస్పరస్, ఐరన్ విలువలు ఉన్నాయ్
* మెంతికూరతోపాటు మెంతి గింజలు కూడా వాడుతుండాలి
* చిరు చేదైన కూరలు తినడం వల్ల వ్యాధి నిరోధకంగా పనికివస్తాయి
* కార్న్, ఆలివ్ ఆయిల్‌తో చేసిన వంటలు మంచిది
* పసుపుని వివిధ రకాలుగా సేవించడం వల్ల అంటువ్యాధులు అంటుకోకుండా ఉంటాయి.
* తాజా కూరగాయలు, తాజా పళ్ల రసాలు, నిప్పుల మీద కాల్చి చేసిన వంటకాలు, తండూరి, పుల్కాలు వంటివి మంచివి.
* వారానికొకసారి ఆలివ్ ఆయిల్ మసాజ్ తీసుకుంటుండాలి
* చివరిగా... బైట తిళ్లకు గుడ్ బై చెప్పేయాలి. రోజూ.. కాచి చల్లార్చిన నీళ్లు తాగుతుండాలి. ఫ్రిజ్‌లో దాచి పెట్టిన ఆహార పదార్థాలను వేడి చేసుకుని తినే అలవాటును మార్చుకోవాలి. తినే పదార్థాలన్నిటినీ మీద మూతలు పెట్టాలి. ఇంట్లో చెత్తని ఎప్పటికప్పుడు పారేస్తుండాలి. ఇంట్లో లోపల నేలని ఫినాయిల్‌తో తుడుస్తుండటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu