Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1880వ సంవత్సరం జూన్ 3న తొలి వైర్‌లెస్ సందేశం

1880వ సంవత్సరం జూన్ 3న తొలి వైర్‌లెస్ సందేశం
మొట్టమొదటి వైర్‌లెస్ సందేశం ఎవరు, ఎప్పుడు పంపారో తెలుసా పిల్లలూ...? తెలిస్తే ఓకే. తెలియనివారు దీనిని చదవి తెలుసుకోవాల్సిందే. 1880వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీన అలెగ్జాండర్ గ్రాహంబెల్ తను కనుగొన్న ఫోటోఫోన్ ద్వారా తొలి వైర్‌లెస్ సందేశాన్ని పంపాడు.

ఆయన కనుగొన్న వాటిలో ఫోటోఫోన్ ప్రధానమైన ఆవిష్కరణ అని నమ్మేవాడు. అప్పట్లో ఆయన వినియోగించిన ఈ ఫోటోఫోన్ పరికరం బీప్ శబ్దం వచ్చిన తర్వాత సమాచారం చేరేది.

గ్రాహంబెల్ రూపొందించిన ఈ ఫోటోఫోన్ అద్దంతో రూపొందించిన పరికరంతో పనిచేస్తుంది. మాట్లాడేటప్పుడు అద్దం కంపిస్తుంది. సూర్యకాంతిని ఆ అద్దంలోకి ప్రవేశించేలా ఏర్పాటు చేశారు గ్రాహంబెల్. ఇది అద్దంలోని ప్రకంపనలు పసిగడుతుంది. ఈ ప్రకంపనలు ధ్వని తరంగాలుగా మారి ఫోటోఫోన్ టెలిఫోన్‌లా పనిచేస్తుంది. అద్దంలో కాంతి తరంగాలుగా మారడం వల్లనే ఇది జరుగుతుంది.

ఈ ఫోటోఫోన్ కనుగొనేందుకు గ్రాహంబెల్‌కు చాలా సమయం పట్టింది. అతను చేసిన ఈ ఆవిష్కరణకు ప్రత్యేక గుర్తిపు లభించింది. అతను రూపొందించిన అసలైన ఫోటోఫోన్ తొలిదశలో మెరుగైన ఫలితాలను సాధించలేదు. దీనికి కారణాలు అనేకం. ఇందులో మేఘాలు ప్రధానపాత్రను పోషించాయి. ఇవి ధ్వనితరంగాలలో అలజడిని సృష్టించాయి.

దీంతో తొలి దశలో అది విఫలమైంది. దీంతో మరోసారి ఆధునికమైన ఫైబర్ ఆప్టిక్స్, టెక్నాలజీతో అతను రూపొందించిన ఫోటోఫోన్ మంచి ఫలితాలనిచ్చింది. ప్రస్తుతం ఫోటోఫోన్ నకలుకు ప్రతిరూపంగా ఆధునికమైన ఫైబర్ ఆప్టిక్స్‌ను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలికాం సేవలలో ఎనిమిది శాతం ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu