Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు ఇంటికొచ్చాక స్కూలు ముచ్చట్లు వినండి!

పిల్లలు ఇంటికొచ్చాక స్కూలు ముచ్చట్లు వినండి!
, శనివారం, 17 సెప్టెంబరు 2011 (17:18 IST)
FILE
నాగరికత రోజు రోజుకి పెరిగిపోతున్న కొద్దీ విద్యకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ కాలంలపిల్లలు కూడా బోలెడు పుస్తకాలు చదవాల్సి వస్తుంది. చిన్న తరగతి పిల్లలకు కూడా బోలెడు హోంవర్క్ ఉంటున్నది. హోంవర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది.

ఈ సమయంలో తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా పిల్లలు మానసికంగా అలజడికి గురయ్యే ప్రమాదం ఉంది. చిన్నారులు మళ్ళీ దారిలో పడేదాకా ఎలా అండగా ఉండాలో సూచిస్తున్నారు పేరెంటింగ్ రంగ నిపుణులు. ఆ సూచనలు మీ కోసం.

ఒక్కవేళ కాస్త ఆలస్యంగా లేచినా స్కూలుకు తయారు కావడంలో వారికి సహాయపడటంలో. మీ తోడ్పాటు వారిలో ధైర్యాన్ని నింపుతుంది.

సాయంత్రం ఇంటికి రాగానే స్కూలుకు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకోవాలి. దానివలన పిల్లలకు తల్లిదండ్రులతో స్నేహభావం పెంపొందుతుంది.

క్లాసులో తోటి విద్యార్థులతో కానీ, టీచర్లతో కానీ ఏవైన ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి.

హోవంర్క్‌లో చేదోడు వాదోడుగా ఉంటూ, వారి సందేహాలను తీర్చాలి.

కనీసం రెండు వారాలు పాటు లేదా వాళ్లు దారిలో పడేదాకా పిల్లలకు అండగా ఉండడం తప్పనిసరి.

Share this Story:

Follow Webdunia telugu