Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరీక్షా సమయం.. ఆఖరి క్షణంలో రివిజన్

పరీక్షా సమయం.. ఆఖరి క్షణంలో రివిజన్
, శుక్రవారం, 7 మార్చి 2014 (16:45 IST)
File
FILE
పరీక్షల సమయంలో అందరూ రివిజన్ చేయడం మామూలే అయితే అది ఏ విధంగా చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే మీరు సంవత్సరం పాటు చదివినదంతా మీరు చేసే రివిజన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఎలాంటి పాయింట్లు చదువుతున్నారో దాని మీదే మీరు రాసే పరీక్ష ఫలితం ఆధారపడి ఉంటుంది.

పరీక్షలకు రెండు రోజుల ముందు ముఖ్యాంశాలను చదవండి. అంతవరకు మీరు ఎక్కువగా చదవని వాటిని మామూలుగా చదవండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన కాన్సెప్ట్‌లను చదవండి. మీకు కష్టంగా ఉన్న అంశాలే ముఖ్యమైనవైతే వాటిని అర్థం చేసుకోండి. ఎందుకంటే అవి తప్పకుండా మీ పరీక్షలో వస్తాయి కాబట్టి. ఆ తర్వాత మీకిష్టమైన, తప్పకుండా వస్తాయని మీరు భావించే వాటిని మరోసారి మననం చేసుకోండి.

పరీక్షలు ఓ రోజులో ఉన్నాయనగా, మీకు అప్పటికీ అర్థంకాని అంశాల జోలికి వెళ్లొద్దు. వాటి జోలికి వెళితే మీకు తెలిసినది కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ముందే చదివి పూర్తి చేసేయండి. అలాగే ఇంతకు ముందు చదివిన అంశాలనే మళ్లీ చదివి రివైజ్ చేసుకోండి. ఎప్పుడూ పుస్తకం పట్టుకుని చదవడం మానేసి కాసేపు అలా రిలాక్స్ అవ్వండి. అంటే టీవి చూడడం, సినిమాకెళ్లడమో కాదు. కాసేపు అలా పార్కుకి వెళ్లి రావచ్చు.

చిన్న పిల్లలతో ఆడుకోవచ్చు. మీకిష్టమైన సంగీతం వినవచ్చు. సినిమాలు, అవీ చూడడంతో మెదడు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా కళ్లకు, మెదడుకు ఒత్తిడి కలగకుండా చూసుకోండి. పరీక్షా కేంద్రానికి వెళ్లేముందు... ఆ రోజు కాస్త ముందుగా లేచి ముఖ్యాంశాలను చదివి మననం చేసుకోండి. చక్కగా స్నానం చేసి దైవధ్యానం లేదా యోగా చేయండి. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరైనప్పటికీ, పరీక్షా హాలుకి అరగంట ముందే వెళ్లండి.

అక్కడ ఏవైనా ముఖ్యాంశాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి కనుక త్వరగా వెళ్లడం మంచిది. పరీక్షా హాలులోకి వెళ్లే ముందే అన్ని చదివేసి పుస్తకాలు ప్రక్కన పెట్టేయండి. ఎవరైనా ఏదైనా చెప్పినా పుస్తకాల జోలికి వెళ్లద్దు. ప్రశాంతంగా కూర్చొని పరీక్ష రాసి మంచి మార్కులను సాధించండి.

Share this Story:

Follow Webdunia telugu