Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోసాల నుండి వయోజనులను రక్షించేందుకు ట్రూకాలర్ కొత్త సౌకర్యం, ఏంటది?

Advertiesment
True caller
డిజిటల్ అరెస్ట్‎లు, నకిలీ గుర్తింపు మోసం, AI వాయిస్ క్లోనింగ్ వంటి ఆన్లైన్ స్కామ్స్ భారతీయ కుటుంబాల సురక్షతకు ప్రత్యక్ష బెదిరింపులుగా ఆవిర్భవిస్తుండగా, ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్స్ ప్లాట్ఫార్మ్, ట్రూకాలర్ భారతదేశములో కుటుంబ రక్షణ ప్రారంభముతో వివరణను సాధారణ గుర్తింపు నుండి కుటుంబ సురక్షతకు మారుస్తోంది. దీనితో ఇది స్వీడెన్, చిలీ, మలేషియా, కెన్యా సహా అనేక గ్లోబల్ మార్కెట్లో విడుదల అయింది.
 
ట్రూకాలర్ వారి కుటుంబ రక్షణ ఒక ఆధునిక డిజిటల్ కవచము. ఇది వేగంగా పెరుగుతున్న దోపిడీ మోసాల నుండి ప్రతి కుటుంబాన్ని రక్షించుటకు రూపొందించబడింది. ప్రతి కుటుంబములో ఒక సాంకేతికత-అవగాహన ఉన్న ఒక వ్యక్తి లేదా సిటిఓ ఉంటారు. వీరు తమ తల్లిదండ్రులు, వయోజనులు, పిల్లల డిజిటల్ సంక్షేమాన్ని చూసుకుంటారు. కుటుంబ రక్షణ సిటిఓకు వాస్తవ-సమయ మోసాల గురించిన హెచ్చరికలు, సుదూర కాల్ హ్యాంగ్-అప్ ఫీచర్‌ను ఇస్తుంది. దీనితో వారు సమూహములోని ఏ సభ్యుడికి వచ్చే మోసపూరిత కాల్స్‌ను అయినా వెంటనే ఎండ్ చేస్తుంది. ఇందులో షేర్ చేయబడిన బ్లాక్ లిస్ట్స్, కస్టమైజ్ చేయదగిన సురక్షత స్థాయిలు, పరికరము భద్రతా సెట్టింగ్స్‌ను పర్యవేక్షించుటకు ఒక డాష్ బోర్డ్ కూడా ఉంటాయి. ఇవి ఆండ్రాయిడ్, iOS పరికరాలు రెండిటి పైనా నిరంతరాయ రక్షణను నిర్ధారిస్తాయి. ముఖ్యంగా, కుటుంబ రక్షణను ఉచితంగా వినియోగించుకోవచ్చు, తద్వారా ప్రజలు వారి కుటుంబ సభ్యులకు వెంటనే రక్షించుకోవడం ప్రారంభించవచ్చు.
 
ఎవరు కాల్ చేస్తున్నారు అని గుర్తించడం 2010 పరిష్కారము. ఆ కాల్‌కు సమాధానం చెప్పడం సురక్షితమేనా అనేది 2026లో ఉన్న ప్రశ్న అని రిషిత్ ఝున్‎ఝున్‎వాలా, సీఈఓ ట్రూకాలర్ అన్నారు. స్కామ్స్ మరింత వ్యక్తిగతంగా, భావోద్వేగంగా మోసపూరితమైనవి అవుతుండగా, మనకు ఒక సమిష్ఠి రక్షణ కావలి. భారతదేశములో కుటుంబ రక్షణను ప్రారంభించడం ద్వారా, మేము కుటుంబములో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సభ్యుడు వారి ప్రియమైన వారికి డిజిటల్ సంరక్షకుడు అయ్యేందుకు అవసరమైన సాధనాలను వారికి ఇస్తున్నాము. దీనితో మొత్తం కుటుంబము మా యూజర్స్ ఆనందించే అత్యధిక ప్రమాణాలు ఉన్న సురక్షతచే కవర్ చేయబడిందని నిర్ధారించబడుతుంది.
 
కుటుంబ సరక్షణ ఉచితంగా అందించబడుతుండగా, సిటిఓ-అడ్మిన్ ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ సబ్‎స్క్రిప్షన్ ఎంచుకుంటే, సమూహంలోని ప్రతి సభ్యుడికి సమగ్ర రక్షణను అందించుటకు రూపొందించబడిన ఆధునిక భద్రతా ఫీచర్స్‌కు వారికి ప్రాప్యత ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ఈ వ్యవస్థ, నిఘా లేకుండా భద్రత అనే పునాదిపై నిర్మించబడింది. షేర్ చేసుకోబడిన భద్రతా ఛత్రము నుండి కుటుంబము ప్రయోజనాలు పొందుతుండగా, ప్రతి ఒక్క సభ్యుడి గోప్యత సంపూర్ణంగా ఉంటుంది. సభ్యులు ఒకరి కాల్ లాగ్స్, మెసేజ్‎లు లేదా వ్యక్తిగత డేటాను మరొకరు చూడలేరు. తద్వారా రక్షణ అనేది వ్యక్తిగత సరిహద్దులు కోల్పోయి రక్షణ పొందడం లేదు అని నిర్ధారిస్తుంది.
 
భారతదేశము తన డిజిటల్ పరివర్తనను కొనసాగిస్తున్న తరుణములో, మొబైల్ కమ్యూనికేషన్‌తో జతపడిన ప్రమాదాలు కేవలం ఇబ్బందుల నుండి తీవ్రమైన ఆర్ధిక, భావోద్వేగ బెదిరింపుల వరకు పెరిగాయి. వ్యక్తిగత-కేంద్రక సురక్షత నుండి ఒక కుటుంబ-రక్షణ నమూనాకు మారడం ద్వారా, ట్రూకాలర్ కమ్యూనికేషన్ ను ప్రతి ఒక్కరికి, ప్రతి చోటా సురక్షితం చేయాలనే తన అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది. కుటుంబ రక్షణ అనేది ఆధునిక డిజిటల్ మోసానికి వ్యతిరేకంగా పోరాటములో అవసరమైన ఒక పరిణామము. ఇది ఆధునిక AI రక్షణ శక్తిని కుటుంబములో అత్యంత విశ్వసనీయులైన రక్షకుడి చేతిలో ఉంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో