Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొబైల్ యూనిట్‌‌ను విక్రయించే ఉద్దేశ్యం లేదు : సోనీ కంపెనీ

మొబైల్ యూనిట్‌‌ను విక్రయించే ఉద్దేశ్యం లేదు : సోనీ కంపెనీ
, సోమవారం, 26 అక్టోబరు 2015 (11:21 IST)
తమ మొబైల్ యూనిట్‌ను విక్రయించే ఉద్దేశమేది లేదని ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సోనీ స్పష్టంచేసింది. దీంతో గడిచిన కొన్ని రోజులగా స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని విక్రయించనున్నట్లు వస్తున్న పుకార్లకు సంస్థ తెరదించినట్లు అయింది. స్మార్ట్‌ఫోన్ బిజినెస్ యూనిట్ ఒక్కసారిగా భారీ వృద్ధిని నమోదు చేసుకోలేకపోయినప్పటికీ విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేసింది. 
 
ప్రస్తుతం మార్కెట్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ.. మొబైళ్ల ఉత్పత్తిని నిలిపివేసే అవకాశాలు లేవని సోనీ మొబైల్స్ తైవాన్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ జోనాథన్ లిన్ వెల్లడించారు. ఈ నెల 19న జపాన్‌లో జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో కంపెనీ సీఈవో హిరోకి టోటో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu