Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నిర్ణయంతో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్

బెంగళూరు : దేశీయ రెండో అతిపెద్ద సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన తన మేజర్ కాంట్రాక్టును రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాంట్లాండ్(ఆర్ బీఎస్) రద్దు చేసింది. ఈ కాంట్రాక్టు రద్దుతో కంపెనీలో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగ

ఆ నిర్ణయంతో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:01 IST)
బెంగళూరు : దేశీయ రెండో అతిపెద్ద సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన తన మేజర్ కాంట్రాక్టును రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాంట్లాండ్(ఆర్ బీఎస్) రద్దు చేసింది. ఈ కాంట్రాక్టు రద్దుతో కంపెనీలో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఈ ప్రాజెక్టు నష్టంతో 40 మిలియన్ డాలర్ల రెవెన్యూలకు ప్రమాదం కూడా వాటిల్లనుంది. యూకేలో విడిగా బ్యాంకును ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో 300 మిలియన్ యూరోల విలియమ్స్ అండ్ గ్లిన్ ఐటీ కాంట్రాక్టును ఇన్ఫోసిస్‌కు, ఐబీఎమ్‌కు ఆర్‌బీఎస్ అప్పజెప్పింది. ఆ కాంట్రాక్టులో మేజర్ పోర్షన్ 200 మిలియన్ డాలర్లు ఇన్ఫోసిస్‌కే దక్కింది.    
 
అయితే యూకే బ్యాంకు- విలియమ్స్ అండ్ గ్లిన్‌ను ప్రత్యేక స్వతంత్ర బ్యాంకుగా ఏర్పాటు చేసే ప్రణాళికను ఆర్బీఎస్ రద్దు చేయడంతో ఈ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ కోల్పోయింది. విలియమ్స్ అండ్ గ్లెన్ పేరిట స్టాండలోన్ బ్యాంకును కేవలం యూకేకు పరిమితం చేయాలని భావించిన ఆర్బీఎస్‌కు సహకరించేలా దాదాపు 3 వేల మంది ఇన్ఫోసిస్ టెక్కీలు పనిచేస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు రద్దుతో వీరందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఆర్బీఎస్ ప్రకటన అనంతరం ఇన్ఫోసిస్ కూడా వచ్చే కొన్ని నెలలో 3 వేల ఉద్యోగులకు స్వస్తి పలుకనున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా ఈ ఉద్యోగాల కోత భారత్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది.
 
డబ్ల్యూ అండ్ జీ ప్రొగ్రామ్ టెక్నాలజీ పార్టనర్‌గా ఇన్ఫోసిస్ కన్సల్టింగ్, అప్లికేషన్ డెలివరీ, టెస్టింగ్ సర్వీసులను అందిస్తోంది. అయితే ఇప్పటికే రెవెన్యూలు పెంచుకోవడంలో నిరాశలో ఉన్న ఇన్ఫీకి, ఈ కాంట్రాక్టు రద్దు రెవెన్యూలపై మరింత గండికొట్టనుంది. 40-50 మిలియన్ డాలర్ల రెవెన్యూలను ఇన్ఫీ కోల్పోతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నష్టం మరోమారు కంపెనీ గైడెన్స్ తగ్గించుకునేందుకు దారితీస్తుందని వెల్లడవుతోంది. ఏప్రిల్ నెలలో ఇన్ఫోసిస్ 11.5-13.6 శాతంగా ఉన్న గైడెన్సును 10 -12 శాతానికి తగ్గించింది. ఇపుడు ఈ కాంట్రాక్ట్ ర‌ద్దుతో ఇన్ఫోసిస్ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్‌నాథ్‌కు ఎదురైన అనుభవం చాలదా.. పాక్ టూర్ పట్ల జైట్లీ వ్యాఖ్యలు