Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్... ధర రూ.18,490.. ఫీచర్లివే...

కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి కంపెనీ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. 'గెలాక్సీ ఆన్ నెక్స్ట్' పేరుతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మిడ

శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్... ధర రూ.18,490.. ఫీచర్లివే...
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (18:00 IST)
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి కంపెనీ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. 'గెలాక్సీ ఆన్ నెక్స్ట్' పేరుతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.18,490గా కంపెనీ నిర్ణయించింది. 
 
ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ స్పందిస్తూ... 2.5డీ గొరిల్లా గ్లాస్, పవర్‌ఫుల్ ఎనిమిదో కోర్ ప్రాసెసర్ సపోర్టుతో ఇది పని చేస్తుందన్నారు. పైగా గెలాక్సీ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోన్‌లో యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కొత్తగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్ పవర్ ప్లానింగ్, ఎస్ సెక్యూర్ వంటి ఫీచర్లను డాటా సెక్యూర్ కోసం పొందుపరచడం మరో ప్రత్యేకత అని తెలిపారు. 
 
ఇదిలావుండగా, ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే... 5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్, 13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాలూ కొడకుని చేసుకుంటామంటూ 44,000 అమ్మాయిలు రెడీయంట... అంతా అమ్మాయిలేనా? డౌటా?