Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2016 నుంచి మార్కెట్‌లోకి నోకియా ఫోన్లు!!

2016 నుంచి మార్కెట్‌లోకి నోకియా ఫోన్లు!!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:57 IST)
ఫిన్‌లాండ్ మొబైల్ దిగ్గజం నోకియా మళ్లీ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయనుందా.. అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. గత 2013లో మొబైల్ ఫోన్ల తయారీ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. ఈ నిర్ణయంతో మొబైల్ ఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా ప్రత్యర్థి కంపనీలు సైతం ఆశ్చర్యపోయాయి. 
 
ఈ డీల్ కుదుర్చుకోవడానికి ప్రధాన కారణంగా మొబైల్ మార్కెట్‌లో ఆపిల్, శాంసంగ్‌ల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక బాగా వెనుకబడింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ నోకియా సంస్థను కొనుగోలు చేసింది. అయితే, మైక్రోసాఫ్ట్ కూడా అంతంత మాత్రంగానే మొబైల్ వ్యాపారాన్ని నడిపిస్తోంది. 
 
ఈ క్రమంలో నోకియా తిరిగి ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. 2016లో పునరాగమనం చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే ఫ్రెంచ్ కమ్యూనికేషన్ సంస్థ అల్కాటెల్ - లూసెంట్‌ను కొనుగోలు చేసిన నోకియా మంచి ఊపుమీదుంది.

Share this Story:

Follow Webdunia telugu