Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లావా 4జి స్మార్ట్ ఫోన్లు : లావా ఏ72, లావా ఏ76.. తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లు

లావా 4జి స్మార్ట్ ఫోన్లు : లావా ఏ72, లావా ఏ76.. తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లు
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (15:37 IST)
లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ తాజాగా రెండు రకాల 4జి స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. లావా ఏ72, లావా ఏ76 పేరుతో వీటిని విడుదల చేసింది. అత్యంత వేగవంతంగా మొబైల్ బ్రౌసింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో వీటిని తయారు చేశారు. అలాగే, ఏ89 పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ మోడల్స్ అన్ని 1.5 జీహెచ్‌జడ్ క్వాడ్ కోర్ ప్రొసెస్సర్, 1 జీవీ ర్యామ్‌లు కలిగివున్నాయి. 
 
లావా ఏ72 మొబైల్: ఈ మొబైల్ ఫోన్ ధర రూ.6499. 5 అంగుళాల డిస్‌ప్లే, ముందు, వెనుక భాగాల్లో 5.0 మెగా పిక్సెల్ కెమెరా విత్ లెడ్ ఫ్లాష్. 250 ఎంఏహెచ్ లిపాలిమర్ బ్యాటరీ, జీపీఎస్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఫీచర్లతో తయారు చేయగా, ఈ ఫోన్ వైట్/గోల్డ్, బ్లూ/బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో లభ్యమవుతుంది. 
 
లావా ఏ76 ధర రూ.5699గా నిర్ణయించారు. ఇందులో కూడా ఏ72 స్మార్ట్ ఫోనులో ఉండే ఫీచర్లతో పాటు.. లెడ్ ఫ్లాష్ సౌకర్యంతో కూడిన వీజీఏ కెమెరా, 1850 ఎంఏహెచ్ లి అయాన్ బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో అంటే తెలుపు, నలుపు రంగుల్లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్‌ టెక్నాలజీతో పని చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యల కంటే పదవులే ముఖ్యం.. ఫిరాయింపుదార్లపై నారాయణ కామెంట్స్!