ఇన్ఫోకస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్... ఫింగర్‌ప్రింట్ స్కానర్... ధర.12,999/-
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఇన్ఫోకస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఇన్ఫోకస్ ఎపిక్ 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999గా కంపెనీ ప్రకటించింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఇన్ఫోకస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఇన్ఫోకస్ ఎపిక్ 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్లో డెకా కోర్ (10 కోర్లు) ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూనిమెటల్ బాడీ వంటి పవర్ఫుల్ ఫీచర్లను అందిస్తున్నారు.
ఇన్ఫోకస్ ఎపిక్ 1 ఫీచర్లను పరిశీలిస్తే...
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్టీపీఎస్ డిస్ప్లే 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, డెకా కోర్ ప్రాసెసర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* బ్లూటూత్ 4.1, యూఎస్బీ టైప్-సి
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్