Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆండ్రీసేన్ కామెంట్‌పై జుకర్ బర్గ్ స్పందన: ఇండియాది వలసవాద భావజాలమా?

ఆండ్రీసేన్ కామెంట్‌పై జుకర్ బర్గ్ స్పందన: ఇండియాది వలసవాద భావజాలమా?
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (13:32 IST)
ఫ్రీ బేసిక్స్‌ను ట్రాయ్ వ్యతిరేకించడంతో ఫేస్‌బుక్ సభ్యుడైన ఆండ్రసన్ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతేగాకుండా ఫ్రీ బేసిక్స్‌ను సమర్థిస్తూ తన ఎఫ్‌బీ అకౌంట్లో కామెంట్‌ను పోస్టు చేశాడు. వలసవాదుల పట్ల భారత్ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని ఆండ్రసన్ తన పోస్టులో అన్నాడు.

అయితే భారత్‌ది వలసవాద భావజాలం అంటూ ఫేస్‌ బుక్‌ బోర్డ్‌ మెంబర్‌ మార్క్‌ ఆండ్రీసేన్‌ చేసిన వ్యాఖ్యలతో జరిగిన నష్ట నివారణకు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. 
 
ఆండ్రే వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తననూ బాధించాయని చెప్పుకొచ్చారు. అయినా అలాంటి మాటలు అనకుండా ఉండాల్సిందని జుకర్ బర్గ్ చెప్పుకొచ్చారు. భారత మార్కెట్ తమకెంతో ముఖ్యమని చెప్పిన జుకర్‌ బర్గ్‌, గతంలో ఇండియాలో పర్యటించినప్పుడు భారతీయులను నిశితంగా పరిశీలించానని తెలిపారు. ప్రజల మానవత్వం, వారు పాటించే విలువలు తనను ప్రభావితం చేశాయని జుకర్ బర్గ్ తెలిపారు.
 
అంతేగాకుండా ఆండ్రసన్ వ్యాఖ్యల పట్ల జుకర్‌బర్గ్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత జుకర్‌బర్గ్ ఒత్తిడితో అండ్రెసన్ ఆ వ్యాఖ్యలను డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పాడు. ఫేస్‌బుక్‌తో పాటు వ్యక్తిగతంగా తనకు భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu