Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలో నోకియా N78 మోడల్ విడుదల

భారతదేశంలో నోకియా N78 మోడల్ విడుదల
అహ్మదాబాద్ , మంగళవారం, 10 జూన్ 2008 (14:33 IST)
భారతీయ మార్కెట్‌లోకి ఆధునిక సదుపాయాలు గల N78 మోడల్‌ను ఫిన్లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ ఉత్పత్తుల సంస్థ నోకియా విడుదల చేసింది. నోకియా ఎన్‌సిరీస్‌లో భాగంగా ఈ మోడల్‌ను విడుదల చేశారు. కొత్త మొబైల్ సెట్‌లో డబ్ల్యూఎల్ఏఎన్, హెచ్‌ఎస్‌పీడీఏ 3.5జీ, 3.2 మెగాపిక్సెల్ కెమేరా, కార్ల్ జెసిస్ ఆప్టిక్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

నోకియా మ్యాప్స్‌తో పాటుగా సమగ్ర జీపీఎస్ వినియోగదారులకు ఈ మొబైల్‌లో కంపెనీ అందిస్తుంది. భారత మార్కెట్‌లో ఎన్78 మోడల్ ధర రూ,19,999లు. నోకియా ఆధునిక మొబైల్ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu