Sanju Samson: రాజస్థాన్‌తో చెన్నై ట్రేడ్ డీల్.. సంజూ శాంసన్‌కు సీఎస్కే పగ్గాలు?

సెల్వి
సోమవారం, 10 నవంబరు 2025 (19:46 IST)
Sanju Samson
రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందే ట్రేడింగ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను సీఎస్‌కే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్‌‌ను ఇవ్వాలంటే ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ చేసిన ప్రతిపాదనకు సీఎస్‌కే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
సంజూ శాంసన్ కోసం స్టాల్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు సామ్‌ కరణ్‌ను వదులుకునేందుకు సీఎస్‌కే సిద్దమైనట్లు సమాచారం. ఈ ఇద్దరిని తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ అంగీకరిస్తే.. ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది. సంజూ శాంసన్ తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఎక్కువ కాలం రాజస్థాన్ రాయల్స్‌కే ఆడాడు. 
 
ఐపీఎల్ 2021 సీజన్ నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ డీల్‌‌పై త్వరలోనే అధికార ప్రకటన రానుందని ఇరు జట్ల వర్గాలు పేర్కొన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ చివరి దశలో ఉండటం..కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఆశించిన ఫలితాలు అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పదస్థితిలో మృతి

Delhi: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలుడు- 8మంది మృతి (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌తో మహిళ కాలికి గాయమైందా? కలెక్టర్ ఏం చెప్పారు?

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖామంత్రిగా అజారుద్దీన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

తర్వాతి కథనం
Show comments