Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాకోసం ఆమాత్రం చేయక తప్పదు : ప్రభాస్

సినిమాకోసం ఆమాత్రం చేయక తప్పదు : ప్రభాస్
, గురువారం, 5 జూన్ 2008 (10:33 IST)
FileWD
వర్షం, ఛత్రపతి, మున్నా చిత్రాల తర్వాత ప్రభాస్ హీరోగా తాజాగా వచ్చిన చిత్రం బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. ఈ చిత్రంలో యాక్షన్ ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని ఆయన అంటున్నారు. తాను స్వతహాగా రజనీకాంత్ అభిమానినని ఆయన చిత్రాల్లో మాస్ మసాలా కావల్సినంత ఉంటుందని ప్రభాస్ అన్నారు. మాస్‌కు దగ్గర కావడానికి అలా ఉండడం అవసరమని ఆయన అంటున్నారు. అలా ఆయన చెబుతున్న కబుర్లు మరికొన్ని...

బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై అనే టైటిల్ బదులు బుజ్జిగాడు ఫ్రమ్ చెన్నై అనే టైటిల్ పెట్టాల్సింది అనే విమర్శలున్నాయి?
మీరన్నది కరెక్టే... ఎందుకంటే బుజ్జిగాడు పాత్ర చెన్నైలో పుట్టలేదు. ఆంధ్రలో పుట్టి 12 ఎళ్లు చెన్నైలో ఉంటుంది. క్యూరియాసిటీ కోసం దర్శకుడు అలా పెట్టారు. అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో బాగా తక్కువగా మాట్లాడినట్టున్నారు?
అదంతా దర్శకుడి ప్రతిభ. పోకిరీలోనూ అలాంటి షేడ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే పూరీకి ఎక్కువ మాట్లాడేవారంటే పడదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడుతారు. అందుకే ఆయన సినిమాల్లోనూ సంభాషణలు తక్కువగా ఉంటాయి. బుజ్జిగాడులో నాకు డైలాగ్స్ తక్కువైనా ఎమోషనల్ డైలాగ్‌కు నేను మాట్లాడే గోదావరి యాసకు డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

మీరు 6ప్యాక్‌ కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది?
నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడే బాడీ మీద శ్రద్ధ పెట్టాను. నటుడికి బాడీ ముఖ్యమని బాబాయ్ చెబుతుండేవారు. అందుకే నేను బాడీపై శ్రద్ధ పెట్టాను. అయితే వర్షం తర్వాత మరికాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాను. అయితే బుజ్జిగాడు కోసం రాత్రిళ్లు అన్నం మానేసి కాస్త లావు తగ్గాను. సినిమాకోసం ఆమాత్రం చేయక తప్పదు కదా

ఏడాదికి ఒకే సినిమా అనే మీ నిర్ణయం సరైనదేనా?
ఏడాదిలో ఒక్క సినిమాకన్నా ఎక్కువగానే చేయవచ్చు. కానీ ఒక్కో చిత్రానికి ఎక్కువగా డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదేసమయంలో నాకంటూ ఉన్న పనుల్ని చూసుకోవడానికి నాకూ సమయం కావాలి కదా.

తదుపరి మీ చిత్రం విశేషాలు?
గోపీకృష్ణా మూవీస్‌లో అనుకుంటున్నాం. కథ ఇంకా రెడీ కాలేదు. అలాగే బయట మరో చిత్రంలోనూ చేయనున్నాను. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.

Share this Story:

Follow Webdunia telugu