Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనం అందరికీ నచ్చాలని లేదు: పూరీ

మనం అందరికీ నచ్చాలని లేదు: పూరీ
WD
విజయవంతమైన సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అరుదైన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. "పోకిరి" చిత్రం పూరీకి ఎనలేని ఖ్యాతిని సంపాదించిపెట్టింది. దీంతో పూరీ అంతర్జాతీయస్థాయి చిత్రాల దర్శకుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. తాజాగా మహేష్‌బాబుతో వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి పూరీ దర్శకత్వం వహించనున్నారు.

థాయ్‌లాండ్ దర్శకుడు జాన్‌హూ తీసిన చిత్రం ఎంతో ఆదరణ పొందిందనీ, ఆయన్ను అంతర్జాతీయ సంస్థ మూడు సంవత్సరాల పాటు తమ చిత్రాలు చేయాలనే ఆఫర్ ఇచ్చిందని, ఇప్పటికీ ఆయనకు ఇంగ్లీషు రాకపోయినా హాలీవుడ్ స్టార్స్‌ను డైరక్ట్ చేస్తున్నాడని పూరీ గుర్తుచేసుకున్నారు.

తాజాగా రవితేజతో "నేనింతే" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఆదివారం (28.09-08) ఆయన పుట్టినరోజు. శనివారం షూటింగ్ షాట్‌కు రెడీ చెబుతూ సీన్ గురించి వివరించి షాట్ ఓకే చేశారు. మళ్ళీ సన్నివేశానికి కాస్త గ్యాప్ ఉండటంతో తర్వాత సీన్ గురించి చర్చించి... కాసేపు రిలాక్స్ అయ్యారు. ఈ సందర్భంగా పూరీని పలకరించగా... సాదరంగా ఆహ్వానం పలికారు.

ప్రశ్న... బాగా స్ట్రైయిన్ అయినట్లున్నారు. డే అండ్‌నైట్ షూటింగ్ జరుపుతున్నారా?
జ... లేదండీ... సాయంత్రం వరకే షూటింగ్. నిద్రలేక ఇలా కన్పిస్తున్నాను. స్క్రిప్ట్‌లో ఏదైనా కొత్తదనం చూపాలనే తాపత్రయంతో దాని గురించే ఆలోచించడం, కథ తయారు చేసుకోవడం, రేపటి షాట్ ఎలా ఉండాలి. ఇవే ఆలోచనలు. దీంతో నిద్ర సరిగ్గా పట్టదు. ఒక్కోసారి నిద్రరావడానికి స్లీపింగ్ పిల్స్ మింగాల్సి వస్తుంది. డబ్బు ఎక్కువున్నా సుఖంగా ఉంటారనేది అసత్యం. ఏవో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి.

ప్రశ్న... ఈ పుట్టినరోజు ఏదైనా ప్రత్యేకతుందా?
జ... పెద్ద ప్రత్యేకత ఏమీలేదు. రేపు డే అండ్ నైట్ షూటింగ్ ఉంది. ఇక్కడే సరిపోతుంది.

ప్రశ్న... "అమ్మా, నాన్న, ఓ తమిళమ్మాయి" చిత్ర కథ రామ్‌గోపాల్ వర్మ ఇన్‌స్పిరేషన్ అని తెలిసింది?
జ... అవునండి. ఆ చిత్రకు ఆయనే ఇన్‌స్పిరేషన్. ఆయన జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను కథగా మలిచాం. వర్మ ఫ్యామిలీ విడిపోయాక జరిగిన సంఘటన అది. వారి కుమార్తె స్కూల్‌లో చదువుతోంది. ఎవరో... ఈమె, వర్మ కూతురు అని పిలిచారు. దీంతో... ఆ పాప వెంటనే కోపంగా... నేను రత్నం కుమార్తెను (అమ్మపేరు) అంటూ తండ్రిని తిట్టింది.

ఆమె తండ్రిపై చూపిన అసహనం నన్ను టచ్‌చేసింది. తండ్రికి దూరమయిన వారి పిల్లల్లో ఆలోచన ఇంత ప్రభావం ఉంటుందా? అని వెంటనే ఆ పాయింట్‌తో కథను అల్లాను. ఆ పాప ప్లేస్‌లో రవితేజ పాత్ర. నాన్న పాత్ర ప్రకాష్ రాజ్. అమ్మ జయసుధ. ఇలా అనుకుని కథను రాసుకున్నా. రవితేజ కోపానికి బాక్సింగ్ గేమ్‌ను ఎంపిక చేసుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా అల్లిన సినిమా అది. అందులో అసిన్‌కూ మంచి పేరు వచ్చింది.

ప్రశ్న... మరి ఆ విషయం వర్మకు తెలిసిందా?
జ... తెలిసి... ఓ రోజు ఆయనే నన్ను అడిగారు. "ఏంటి? నా ఇన్‌స్పిరేషన్‌తో సినిమా తీశావటగదా అని" అవునని సమాధానమిచ్చి సినిమా డీవీడీ ఆయనకు ఇచ్చాను. చూసిన తర్వాత హైదరాబాద్‌లో "ఆగ్" ప్రమోషన్‌కు వచ్చారు. ఇద్దరు కలిశాం. మీరు పంపిన డీవీడి చూశాను. నా కథ అన్నారు... కానీ అర్థం కాలేదు... అని చెప్పారు.

webdunia
WD
ప్రశ్న... మరి ఆ విషయం వర్మకు తెలిసిందా?
జ... తెలిసి... ఓ రోజు ఆయనే నన్ను అడిగారు. "ఏంటి? నా ఇన్‌స్పిరేషన్‌తో సినిమా తీశావటగదా అని" అవునని సమాధానమిచ్చి సినిమా డీవీడీ ఆయనకు ఇచ్చాను. చూసిన తర్వాత హైదరాబాద్‌లో "ఆగ్" ప్రమోషన్‌కు వచ్చారు. ఇద్దరు కలిశాం. మీరు పంపిన డీవీడి చూశాను. నా కథ అన్నారు... కానీ అర్థం కాలేదు... అని చెప్పారు.

దాంతో నేను... స్కూల్లో పాప అన్న డైలాగ్‌ను... ఆధారంగా చేసుకుని అల్లిన కథ అని వివరించాను. మీది ప్రకాష్ రాజ్ పాత్ర అన్నా... దాంతో ఆయన కాసేపు మౌనం వహించి, అక్కడే ఉన్న వాళ్ళమ్మాయిని పిలిచారు. అంకుల్ ఇలా అంటున్నారు. నిజమేనా? అన్నారు. "ఏమోడాడీ... నిన్ను తిట్టానేమో" గుర్తులేదని తెలివిదా చెప్పేసరికి... ఆ తర్వాత ఒక్కసారిగా నవ్వారు.

ప్రశ్న... మరి ఇప్పడు తీస్తున్న "నేనింతే" కూడా దేనికైనా ఇన్‌స్పిరేషనా?
జ... అవును. ఇదంతా ఇండస్ట్రీ కథ. మా కథ. మా అందరి జీవితాలు ఇందులో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏదో చేయాలని కృష్ణానగర్ వచ్చిన ప్రతి వ్యక్తి జీవితాలకు అద్దంపట్టే చిత్రమిది.

ప్రశ్న.. ఇండస్ట్రీపై చాలా చిత్రాలు వచ్చాయి కదా? ఇందులో ప్రత్యేకత ఏమిటి?
జ... గతంలో వచ్చిన సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ టచ్ చేసినా చివరికి లవ్‌ట్రాక్‌లో వెళతాయి. ఖడ్గంలో కూడా ఒక పార్ట్ మాత్రమే చూపించారు. "నేనింతే"లో అలాకాదు. ప్రతి ఒక్కరిని టచ్ చేశాం. ఎవరికి వారు అన్వయించుకునేట్లుంటుంది. కొన్ని చురకలుంటాయి. దర్శకుల బాధలు, నిర్మాతల కష్టాలు, హీరోలు చేస్తున్న తప్పులూ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్‌ల మధ్యపోటీ, హీరోల మధ్య నెలకొన్న పోటీ ఇలా చాలా విషయాలున్నాయి.

ప్రశ్న... మరి దీనివల్ల మీపై వ్యతిరేకత ఉండదా?
జ.. మనం అందరికీ నచ్చాలని లేదు. నచ్చం కూడా. భగవంతుడ్ని అందరూ పూజిస్తారు. తిడుతుంటారు కూడా. ఉదాహరణకు నాకు ఫలానా దేవుడు ఇష్టంలేదు. కానీ వేరేవారికి ఆయనే దేవుడు. ఒక్కొక్కరు ఒక్కో భగవంతుడ్ని పూజిస్తారు. కానీ సినిమా చూసినవాడు. ఇది అవాస్తవం అనలేడు. జన్యూన్‌గా తీస్తున్న సినిమా ఇది.

ప్రశ్న... మరి ఇండస్ట్రీలో భాగమైన జర్నలిస్టుల పాత్ర ఏమేరకు చూపిస్తున్నారు?
జ.. "పోకిరి"లో ఒక కోణంలో చూపాం. అలాకాకుండా ఇందులో జర్నలిస్టుల గురించి పెద్దగా టచ్‌చేయకపోయినా బాధ్యులెవరు? అనే కాన్సెప్ట్‌తో విలేకరి... నిర్మాతను, హీరోను, బయ్యర్‌ను, ఎగ్జిబిటర్‌ను, ఆఖరికి ప్రేక్షకుడిని ఇంటర్వ్యూ చేసే సన్నివేశం చాలా హైలైట్‌గా ఉంటుంది. తమకే చిత్రం కావాలని ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ప్రేక్షకులు ఏది అడుగుతున్నారని నిర్మాతలు, హీరోలు భావిస్తున్నారన్నదానికి చక్కని చురకలు ఇందులో ఉంటాయి.

ప్రశ్న... ఆ మధ్య బయటి బేనర్‌లో చేయనని ప్రకటించారు కదా?
జ.. అవును. అన్నాను... మిగతా నిర్మాతల ఒత్తిడి తట్టుకోలేక ఆ ప్రకటన ఇచ్చాను. ప్రస్తుతం నిర్మాత బతికే ఛాన్స్‌లేదు. సినిమా అంటేనే భయపడే స్థితి నెలకొంది. సొంత ప్రొడక్షన్ చేస్తే నిర్మాతల సమస్యలు అన్నీ పరిష్కరించుకోవాలి. ఇంటికెళితే నిద్రకూడా సరిగ్గా పోవడానికి ఆస్కారం లేదు. అలాంటి టైమ్‌లో దర్శకత్వం, స్క్రిప్ట్ కూడా అదనపు బాధ్యత మోయలేక తలనొప్పిగా తయారైంది. అందుకే ఆ ప్రకటనను విరమించుకున్నాను.

webdunia
WD
ప్రశ్న... మరి మీ దర్శకత్వంలో మీ నిర్మాత ఎలా ఫీలవుతున్నారు?
జ... నేను అనవసరపు ఖర్చులు పెట్టను. భారీ సెట్టింగులు వేయను. కథ మేరకు ఎంతవరకు కావాలో అంతే ఖర్చుపెట్టిస్తాను. నా చిత్రాలన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుంది.

ప్రశ్న... నిర్మాణ వ్యయం ఇలా పెరగడానికి కారణమేమిటి?
జ.... ఫలానా అని ఎవ్వర్నీ అనలేం. ఇదంతా ఫాల్స్ ఇమేజ్ వల్లే వస్తుంది. ఆ ఇమేజ్‌తో ఎక్కువ ఖర్టుపెట్టించడం జరుగుతుంది. అనవసరమైన ఫైట్లు పెడుతున్నారు. ఇలా చేస్తే బాగుంటుందని భావించి చేయడం. ఇలా రకరకాల కారణాలు.

ప్రశ్న... రెమ్యునరేషన్ ఏ ప్రాతిపదిక తీసుకుంటున్నారు?
జ... ఎవరైనా మార్కెట్‌ను బట్టే ఇస్తుంటారు. డిమాండ్ చేస్తే ఇవ్వరు. అంత అమాయకులు ఎవరూ లేరు ఇండస్ట్రీలో. నా విషయానికి వస్తే... ఓ సినిమాకు ఇంత ఇస్తాం అన్నారు. ఓహో... ఇంతకూడా తీసుకోవచ్చా? అని నాకు అనిపించింది. మనమేమిటో ఎదుటివాడికి తెలుస్తుంది. అందుకే పారితోషికానికి కొలబద్ద ఇదీ అనేది కరెక్ట్‌గా లేదు. ఒక రకంగా చెప్పాలంటే సక్సెసే కొలబద్ద.

ప్రశ్న... రెండు వారాల టిక్కెట్ల పెంపు రద్దుపై మీ స్పందన?
జ... ఇవన్నీ సెన్సిటివ్ విషయాలు. ఏది చెబితే ఏమవుతుందోనని చాలామంది అడిగినా చెప్పలేదు. రెండువారాల పెంపుదల వల్ల నిర్మాతకు లాభమే జరిగింది. వచ్చిన దాంట్లో కొంత షేర్ వారికీ వెళ్ళేది. ఎక్కువ థియేటర్లు.. పెంచిన టిక్కెట్ల రేటుతో లాభించేవి. ఒక్కసారిగా ప్రభుత్వం రద్దుచేసే సరికి దీనివల్ల నిర్మాతలకు ఆ మేరకు లాసే.

ప్రశ్న... "నేనింతే"లో హీరోహీరోయిన్ల పాత్రలెలా ఉంటాయి?
జ... హీరో తను అసిస్టెంట్ డైరక్టర్ కావాలని యాంబిషన్‌తో ఇక్కడికి వస్తాడు. హీరోయిన్‌ గ్రూప్ డాన్సర్లలో సైడ్ డాన్సర్‌ రోల్‌ను పోషిస్తుంది.

ప్రశ్న... "నేనింతే" ఎంతవరకు వచ్చింది?
జ... దాదాపు ముప్పావు పార్ట్ అయింది. పాటలు కొన్ని చిత్రించాలి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 18న విడుదలకు సిద్ధం చేస్తున్నాం.

ప్రశ్న... మీ తదుపరి సినిమాలు?
జ... ఆదిత్యరాం నిర్మాతగా మా తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా ఓ కొత్త చిత్రం చేస్తున్నా. తర్వాత మహేష్‌బాబుతో చేస్తున్నాను.

ప్రశ్న... మహేష్‌బాబుకు ఏ తరహాలో మీ చిత్రముంటుంది?
జ... "పోకిరి" కంటే మంచి కథ రెడీ అయింది. లైన్ అనుకున్నాం. దాన్ని ఓకే చేశారు. ఇంకా దానికి తుదిమెరుగులు దిద్దాలి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆ చిత్రముంటుంది. వార్నర్ బ్రదర్స్ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ సినిమా హిట్టయితే హాలీవుడ్‌లో ఆఫర్లు వస్తాయేమోమరి.

ప్రశ్న... దర్శకుడిగా చేయలేకపోయాననే అసంతృప్తి ఉందా?
జ.. మంచి కథను ఇంకా చేయలేకపోయాననే అసంతృప్తి ఉంది. అంటే ఇంతకుముందువి మంచివి కాదని కాదు. సహజత్వంతో కూడిన చిత్రాలు చేయాలనే కోరిక ఇంకా మిగిలి ఉంది. అలాంటి చిత్రాలు చేయవచ్చుకానీ గ్యారంటీ తక్కువ. కోట్ల వ్యాపారంతో కమర్షియల్ చిత్రాలే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా బర్నింగ్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి. కానీ అవి తీస్తే కొంతమందికి నచ్చకపోవచ్చు.

ప్రశ్న... కొత్తవారితో తీసే ఆలోచన ఉందా?
జ... ఇప్పుడప్పుడేలేదు. కొత్తవారితో తీసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఉదాహరణకు మా తమ్ముడే. వాడితో తీద్దామంటే.. నిర్మాతలు ముందుకు రావడం లేదు. కానీ ఒక్కటి చెప్పగలను. రాబోయే రెండేళ్లలో కొత్త సినిమాలదే రాజ్యం. ఎందుకంటే.. మల్టీఫ్లెక్స్ థియేటర్లు వచ్చేస్తున్నాయి. యూత్ ఎక్కువగా సినిమాలు చూడాలంటే రొటీన్‌వి నచ్చవు.

ప్రశ్న... మరి "నేనింతే"లో ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులతో తీస్తున్నారు కదా? ఎలాంటి సినిమా అవుతుంది మీకు?
జ... మానసిక సంతృప్తిని కల్గించబోయే చిత్రమని చెప్పగలను. అంటూ.... ఇంటర్వ్యూను ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu