Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాడుతూనే జీవితాన్ని ముగిస్తా... ఆశాభోస్లే

పాడుతూనే జీవితాన్ని ముగిస్తా... ఆశాభోస్లే
కొద్దినెలల క్రితం బ్రె‌ట్‌లీ, ఊర్మిళా మంటోడ్కర్ సంజయ్‌దత్‌లతో కలిసి ఆశాభోస్లే పాడినప్పుడు విజేతగా ఆమే నిలిచారు. అదే ఆశా మరియు స్నేహితులు ప్రోగ్రాంగా పేరు పొందింది.. స్నేహితులను సంపాదించుకోవడంలో ఆమెకు అడ్డేలేదు మరి. ఈ సారి తనతో కలిసి పాడేందుకు మరి కొందరికి ఆశా అవకాశం ఇచ్చారు. 75 సంవత్సరాల వయస్సులో కూడా ఆశాభోస్లే విశ్రాంతి కోరుకోవడం లేదు. ఇన్నేళ్లుగా తమ సంగీత ప్రస్థానం గురించి ఆమె టిడబ్ల్యుఎఫ్ కరస్పాండెంట్‌తో పంచుకున్నారు.

ఈ వయసులోనూ ఇంత శక్తి మీకు ఎక్కడినుంచి వస్తోంది?
హహ్హహ్హహ్హ..... నేను చనిపోయేంతవరకూ ఇలాగే ఉండాలని నా కోరిక. నేను యవ్వనంలోనే ఉన్నాను అని మనసారా ఫీల్ కావడంలోనే నా విజయ రహస్యం ఉంది మరి. జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి జీవితం చివరి క్షణం వరకూ నేను నాపని చేస్తూనే ఉంటాను.

మీరంటున్నది పాడటం గురించేనా?
అవును. అంతకు మించి ఏముంటుంది. సంగీతమే నా సర్వస్వం, దాంతోనే జీవిస్తాను దాంతోనే మరణిస్తాను.
అందుకే మీరు ఆశా మరియు స్నేహితుల గురించి ఆలోచిస్తుంటారా?

అవును. అదొక ప్రేమైక అనుభవం.... ప్రత్యేకించి బ్రెట్‌లీతో.. సంజయ్‌దత్‌తో కూడా ఇంతే మరి. సంజయ్ ఎంత నమ్రత గల వ్యక్తో మరి. పైగా వీళ్లంతా నన్ను అభిమానిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆశా మరియు స్నేహితులు 3వ భాగం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మరి.

వావ్.. ఎంత గొప్ప ఆలోచన....
అవును అతి త్వరలోనే ఇది పూర్తవుతుంది. మిథున్ చక్రవర్తి ఇప్పటికే తన వెర్షన్ రికార్డ్ చేశారు అలాగే అనిల్ కపూర్ కూడా..
వాళ్లిద్దరూ పాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురయ్యారు.

వారు స్వతహాగా భావోద్వేగపరులు మరి...
అవును. వారు భావోద్వేగపరులే ఇరువురూ చక్కగా పాడారు. వాళ్లు మంచి గాయకులు కూడా..

ఈ కార్యక్రమంలో పాడగల వ్యక్తులను మీరు ఎలా కనిపెట్టగలిగారు.. మరోలో అడగాలంటే వాళ్లే మీ వద్దకు వచ్చి ఈ విషయమై సంప్రదించారా?
అహ.. నేనే తెలుసుకున్నాను.. వాళ్లు మంచి గాయకులు. పైగా వారు నన్నెంతో గౌరవించారు. వీరిలో ఎవరు మంచి గాయకులో కనుక్కున్న తర్వాతే నేను రికార్డింగ్‌కు పోయాను.

ఈ ఆల్బమ్ మేము వినడానికి ఎంత కాలం పట్టవచ్చో తెలుపండి....
నా వెర్షన్ కూడా ఇంకా రికార్డ్ చేయాలి కాబట్టి ఇంకా చాలా పని మిగిలే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పని చాలా చేయాల్సి ఉంది. అది ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేను కానీ.. తప్పకుండా విడుదల అవుతుంది.

మిథున్ చక్రవర్తి లేదా అనిల్ కపూర్ వీరిలో ఎవరు మంచి గాయకులు మరి..
ఇరువురూ మంచి గాయకులే. చివరకు బోమన్ ఇరానీ కూడా మేటి గాయకుడే. గతంలోనూ తాను పాడగా ఒకటి రెండు సార్లు విన్నాను కాబట్టి అనిల్ మంచి సింగర్. ఇక పోతే మిథున్ చక్రవర్తికి ఇప్పటికీ శక్తి ఉంది. పాట పాడాలని నేను కోరినప్పుడు అతడు చూపిన ఆసక్తికి నేను ఆశ్చర్యపోయాను మరి.

ఈ ప్రాజెక్టును ఇంకా ముందే తీసుకు వచ్చి ఉంటే బాగుండేది మీరు భావించడం లేదా?
అవును నా అభిప్రాయం కూడా ఇదే.. చాలామందిని నేను కోల్పోయాను. పాడగలవారిలో చాలామంది ఇప్పుడు ఇక్కడ లేరు. మా కాలంలో మేటి గాయకులుగా కూడా మారిన నటులు ఉండేవారు.

అంటే మీరంటున్నది కిషోర్ కుమార్ గురించేనా?
ఆయన ఒక మహామేధావి మరియు మంచి స్నేహితుడు. అశోక్ కుమార్ కూడా మంచి గాయకుడే. రాజ్ కపూర్ షమ్మీ కపూర్ కూడా మంచి గాయకులే. జీవన్ జ్యోతిలో నేను షమ్మీ కపూర్‌తో ఒక పాటకు ప్లేబ్యాక్ పాడాను. ఆ రోజులే వేరు.

మీరు ఎన్నటికీ మంచి సంగీతం మధ్యనే జీవించారు. ఇప్పటికీ మీరు పాడగలుగుతున్నారు. అయితే మీ పిల్లలు ఈ వృత్తిలోకి రానందుకు మీరు ఎప్పుడూ బాధపడలేదా..
(క్షణం పాటు ఆలోచించి)... నేను వారిని ఆదేశించాను.. నా సలహాకు వారు కట్టుబడినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నాతోపాటు రికార్డింగ్ స్టూడియోకు కానీ సినిమా సెట్స్‌లోకి కానీ రావద్దని వారికి చెప్పాను. ఎందుకంటే అంత చిన్న వయసులో వారిపై భారం రుద్దరాదని భావించాను. అలా ఎప్పుడూ జరగలేదు కూడా.

ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా పాడుతున్నట్లు లేదు...
ఎందుకంటే నా షరతుల ప్రకారమే నేను పాడుతున్నా కాబట్టి...

అయితే మీరు ఇంకా అనేక లైవ్ ‌షోలను చేస్తున్నట్లుందిగా..
అవును... భారత్‌లోనూ అమెరికాలోనూ కూడా చాలానే చేస్తున్నాను. నా పని శైలి ఎప్పుడూ వేరుగానే ఉంటోంది. లతా దీదీతో కూడా ఇలాగే ఉంటుంది. నేను లైవ్ షోలను చేసేటపుడు నేను చెప్పినట్లే జరగాలి. స్టేజ్‌పై గందరగోళం నాకు ఇష్టం లేదు. అది నేను చేస్తున్న షో కాబట్టి, ప్రజలకు వినోదాత్మక విషయాన్ని సమర్పించాలని నాకు తెలుసు. నా సంగీత వాయిద్యకారులు కూడా నేను చెప్పింది పాటిస్తారు. నా పనిలో ఎవరి జోక్యాన్ని నేను సహించను కాబట్టి నా షోలో ఎవరూ జోక్యం చేసుకోరు మరి..

Share this Story:

Follow Webdunia telugu