అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒసామా బిన్ లాడెన్ ఇంకా పాకిస్థాన్‌లోని కబాయిలీ ప్రాంతంలోనే ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ లియోన్ పనేటా తెలిపారు.
కబాయిలీ ప్రాంతాలలో తమ సీఐఏ సభ్యులు పాకిస్థాన్ సైనికుల సహాయంతో అల్ ఖైదా నేతలున్న ప్రాంతంలోకి చేరుకుంటారు, ఎందుకంటే ఈ ప్రాంతంలోనే లాడెన్ ఉన్నట్లు దౌత్యాధికారుల సమాచారం.
లాడెన్‌ను వెతికి పట్టుకోవడం సీఐఏకున్న తొలి ప్రాధాన్యమని ఆయనక్యాపిటల్ హిల్‌లో ఉపన్యాసమిస్తూ ఈ విషయం వెల్లడించారు.
తమ సంస్థకు పాక్ సైన్యం ఆక్రమణలతో లాడెన్‌ను పట్టుకునే అవకాశం అమెరికాకు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌లో సీఐఏకు చెందిన అధికారులు, ఏజెంట్ల సంఖ్యను పెంచినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీరు అక్కడ అల్‌ఖైదా తీవ్రవాద సంస్థలపై దాడులు ముమ్మరం చేయడమే కాకుండా ఇతర సూచనలు అందిస్తుంటారని ఆయన వివరించారు. దీంతో లాడెన్‌ను పట్టుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.