అగ్రరాజ్యం అమెరికా దుస్థితి కళ్లముందు కనిపిస్తుండటంతో బ్రిటన్ కళ్లు మేల్కొంది. అమెరికా పిరిస్థితి తమకు పట్టకుండా ఉండేందుకు వీలుగా ఇప్పటి నుంచి పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోని మహిళా ఉద్యోగుల సంఖ్యను బ్రిటన్ ప్రభుత్వం తగ్గింపు చర్యలను అంతర్గతంగా చేపట్టింది.
ప్రముఖ మేధోమథన సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ వెల్లడిస్తున్న గణాంకాలను బట్టి ఉద్యోగాల నుంచి దూరమవుతున్న వారిలో మహిళలు ఎక్కవగా ఉంటున్నారని తాజాగా వెల్లడైంది. 2010 జూన్ నాటికి మహిళా ఉద్యోగుల తొలగింపు 30 శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ నాటికి అది 40 శాతానికి చేరినట్టు ఆ సంస్థ పేర్కొంది. గతేడాది ప్రభుత్వరంగ సంస్థల నుంచి తొలగించిన మహిళా ఉద్యోగుల సంఖ్య 1,43,000గా ఉందని తెలిపింది.