తమ దేశం పొరుగు దేశమైన భారతదేశంతో శాంతిని కోరుకుంటోందని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు.
పాకిస్థాన్ భారతదేశంతో శాంతిని కోరుకుంటోందని, ఈ శాంతి ప్రక్రియను భవిష్యత్తులోను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్‌తో సమావేశమైనప్పుడు చెప్పారు.
సెప్టెంబర్ నెల 27న తాను భారతదేశపు విదేశాంగ మంత్రి ఎస్ఎమ్.కృష్ణతో జరిపిన చర్చలు ఫలవంతమైనాయని అనుకుంటున్నానని, దీంతో తాము భారతదేశంతో శాంతికి పూనుకున్నట్లు వెల్లడిస్తున్నట్లు హిల్లరీకి తెలిపారు.
తమ ఇరు దేశాలు మెరుగైన సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాయని, దీనికిగాను ఎస్ఎమ్.కృష్ణ తన దేశానికి వెళ్ళిన తర్వాత అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతారని తాను ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు.