అల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌పై జరిగిన దాడిని ఇతివృత్తంగా తీస్తున్న హాలీవుడ్ ఫిల్మ్ ప్రాజెక్ట్‌కు ఒబామా ప్రభుత్వం సహకరిస్తూ జాతి భద్రతను తాకట్టుపెడుతున్నదని రిపబ్లికన్ విధానకర్త పీటర్ కింగ్ ఆరోపించారు. ఆస్కార్ అవార్డు పొందిన చిత్రనిర్మాత కేధరిన్ బిగేలోతో పెంటగాన్‌కు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేపట్టాలని స్వదేశ భద్రతపై హౌస్ కమిటీ ఛైర్మన్ కూడా అయిన రిపబ్లికన్ పార్టీ నేత పీటర్ కింగ్ డిమాండ్ చేశారు.
మిలిటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అవడంపై ఆందోళన చేస్తూ ఒబామా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పీటర్ తెలిపారు. కాగా బిన్ లాడెన్ వేటపై కేంద్రీకరించిన చిత్రానికి సంబంధించి స్కీన్ ప్లే రైటర్ మార్కో బోల్, బిగోలోలతో ప్రాధమిక చర్చలు జరిపినట్లు పెంటగాన్ ధృవీకరించింది. అయితే పీటర్ చేసిన ఆరోపణలు నిరాధారమైన విమర్శలుగా వైట్‌హౌస్ పేర్కొంది.