శ్రీలంకలో జరిగిన దక్షిణ ప్రొవియన్షియల్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ఎల్టీటీఈపై విజయం సాధించిన లంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సేకు ఈ ఎన్నికల ఫలితాలు మరింత నైతిస్థైర్యాన్ని ఇచ్చాయి.
52 మంది సభ్యులు కలిగిన సదరన్ ప్రొవియన్షిల్ కౌన్సిల్లో ఎన్నికల్లో యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్స్ 38 సీట్లు గెలుచుకుంది. కాగా, శనివారం ఈ ఎన్నికలు జరుగగా, ఆదివారం ఫలితాలను వెల్లడించారు. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రొవియన్షిలకు జరిగిన చివరి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్ నేషనల్ పార్టీ 14 సీట్లను కైవసం చేసుకోగా, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మూడు సీట్లకే పరిమితమైంది. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో సుమారు 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.