Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాడి చేస్తే చేతులు విరిచేస్తాం: అహ్మదీనెజాద్

Advertiesment
ఇరాన్
ఇరాన్‌పై దాడి చేయాలనుకున్నవారు, ఈ చర్యకు ఉపక్రమిస్తే.. తమ సైన్యం వారి చేతులు విరిచేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ ఉద్ఘాటించారు. తమపై సైనిక చర్యకు దిగే వారికి ఇరాన్ సైన్యం తగిన గుణపాఠం నేర్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఈ ప్రాంతాన్ని విడిచివెళ్లాలని నెజాద్ మరోసారి డిమాండ్ చేశారు.

టెహ్రాన్‌లో మంగళవారం జరిగిన వార్షిక ఆర్మీ పెరేడ్‌లో అహ్మదీనెజాద్ ప్రసంగిస్తూ పశ్చిమ దేశాలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్‌పై దాడి చేయాలనే ఆలోచనకు ఎవరూ సాహించలేరని, ఎందుకంటే ఈ రోజు ఇరాన్ శక్తివంతమైన, ఎంతో అనుభవం గడించిన దేశమని నెజాద్ పేర్కొన్నారు. చీకటి శక్తులకు బుద్ధి చెప్పేందుకు మన దళాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎక్కడి నుంచైనా ఎవరైనా మనపై బుల్లెట్ పేలిస్తే, మనం వారి చేతులు కత్తిరించగలమన్నారు.

ఇదిలా ఉంటే ఈ మిలిటరీ వేడుకల సందర్భంగా ఓ యుద్ధ విమానం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. పెరేడ్ జరుగుతున్న ప్రదేశానికి సమీపంలో విమానం కూలిపోయిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని ఫార్స్ అనే ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇరాన్ అధికారిక మీడియా మాత్రం ఈ వార్తలను ఖండించింది. పెరేడ్‌లో కూలిపోయిన విమానం భాగం కాదని, కూలిన విమానం శిక్షణకు ఉపయోగించేదని ఇరాన్ ప్రభుత్వం మీడియా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu