పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే భాగంలో బుధవారం మూడు రోజుల అధికారిక పర్యటనకు గానూ టర్కీ వెళ్లారు. టర్కీ విదేశాంగ మంత్రి అహ్మెట్ దవుతోగ్లు ఆహ్వానం మేరకు అంకారా (టర్కీ రాజధాని)ను సందర్శిస్తున్న ఖర్ టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లాహ్ గుల్, ప్రధానమంత్రి రిసెప్ తయ్యిపి ఎర్డోగన్‌లతో భేటీ కానున్నారు.
గత నెలలో విదేశాంగ మంత్రిగా నియమించబడిన తర్వాత రబ్బానీ ఖర్ చేపట్టిన తర్వాత రెండో విదేశీ పర్యటన ఇది. ఆమె భారత్‌లో జరిపిన తొలి పర్యటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై ఖర్, దవుతోగ్లులు చర్చిస్తారని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
సంవత్సరాలుగా యుద్ధంతో నలిగిపోతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడానికి గానూ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాలు, తాలిబాన్ల మధ్య జరుగుతున్న చర్చలకు టర్కీ తెరవెనుక పాత్ర పోషిస్తున్నది.