వైమానిక దళ సామర్థ్యం విషయంలో చైనాకు బారత్ ఏమాత్రం సరితూగదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ పీవీ నాయక్ తెలిపారు. ప్రస్తుతం భారత వైమానిక దళ సామర్థ్యం సరిపడ స్థాయిలో లేదన్నారు. చైనా విమానిక దళంతో పోలిస్తే భారత వైమానిక దళ సామర్థ్యం మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుందని వివరించారు.
వైమానిక దళం సామర్థ్యం పెంచేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని నాయక్ తెలిపారు. ఇదిలా ఉంటే గత నెలలో ఆర్మీ చీఫ్ సురేష్ మెహతా కూడా మిలిటరీ సామర్థ్యం విషయంలో చైనాకు భారత్ సరితూగదని చెప్పడం గమనార్హం. తాజాగా ఇదే విషయాన్ని నాయక్ కూడా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే చైనా నుంచి భారత్‌కు ఎటువంటి ముప్పు పొంచిలేదని నాయక్ తెలిపారు.