ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోనున్న భారతదేశ దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోనున్న భారతదేశ దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
గురువారం ఉదయం గం. 10.15లకు కాబూల్‌లోని దౌత్యకార్యాలయం వద్దనున్న సిటీ సెంటర్ భవనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన ఓ జీపు గుద్దుకుంది. దీంతో అక్కడ పేలుళ్ళు జరిగాయి. పేలుళ్ళ కారణంగా అక్కడున్న పాస్‌పోర్ట్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. పేలుళ్ళు జరగడంతో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాంద జరగలేదు.
ఇదిలావుండగా సిటీ సెంటర్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ప్రాంతం. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం భద్రతా దళాధికారులకు ఓ సవాలుగా మారింది.