ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితి మరింతగా దిగజారుతోందని దీనిని తాలిబన్లు లాభపడుతున్నారని అమెరికా భావిస్తోంది.
ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితి మరింతగా దిగజారుతోందని అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్ అమెరికా సెనేట్‌కు వివరించారు.
అక్కడ పరిస్థితి దిగజారడంతో తాలిబన్ ఉగ్రవాదులు దానిని వారికి అనుగుణంగా మలుచుకుంటున్నారని ఆమె తెలిపారు.
ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్గన్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, జనరల్ మైక్‌క్రిస్టల్ పంపిన సమాచారంతో తాము ఏకీభవిస్తున్నట్లు ఆమె అన్నారు.
ఇదిలావుండగా ఇటీవల జనరల్ మైక్‌క్రిస్టల్ అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాకు పంపిన నివేదికలోను ఇదే విషయాన్ని వివరించారని, అక్కడి పరిస్థితి మరింతగా దిగజారుతోందని తన నివేదికలో వివరించారు.
కాగా ఆఫ్గనిస్థాన్‌కు ప్రత్యేకంగా నలభైవేల మంది అదనపు సైనిక బలగాలను పంపాలని కూడా ఆయన అమెరికా అధ్యక్షుడిని కోరినట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. దీంతో అక్కడ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు వీలవుతుందని కూడా తన నివేదికలో తెలిపారు.