పెరూ దేశంలోని అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉన్న తమ భూముల్లో చమురు, సహజవాయువు నిక్షేపాల అన్వేషణను వ్యతిరేకిస్తూ భారత జాతీయులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. భారత జాతీయులకు, పోలీసులకు మధ్య శుక్రవారం భూవివాదంపై ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 11 మంది పోలీసులు, 25 మంది నిరసనకారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఉత్తర పెరూలోని ఉట్కుబాంబా ప్రావీన్స్‌లో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. డివిల్స్ కర్వ్ అనే ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న 5 వేల మంది భారతీయులను చెదరగొట్టేందుకు అధికారిక వర్గాలు ప్రయత్నించాయి. పోలీసులు హెలికాఫ్టర్ల నుంచి తమపై భాష్పవాయువు ప్రయోగించడంతోపాటు, కాల్పులకు పాల్పడ్డారని ఆందోళనకారుల నేతలు తెలిపారు.
జాతీయ పోలీసు డైరెక్టర్ మాత్రం ఆందోళనకారులే అధికారులపై మారణాయుధాలతో దాడులు చేశారని, ప్రభుత్వ భవనాలకు నిప్పంటించారని తెలిపారు. తాజా హింసాకాండలో 11 మంది పోలీసు అధికారులు మృతి చెందారని కేబినెట్ చీఫ్ యెహుడే సిమోన్ తెలిపారు. 109 మంది గాయపడ్డారన్నారు. ఘర్షణల్లో ముగ్గురు భారతీయులు మాత్రమే మృతి చెందారని తెలిపారు.
ఇక్కడ స్థానికులు బాధితులు కాదని, పోలీసు అధికారులని కేబినెట్ చీఫ్ పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనకారుల నేతలు తాజా ఘర్షణల్లో ముగ్గురు బాలలతోసహా, 25 మంది భారతీయులు మృతి చెందారని పేర్కొన్నారు. మరో 50 మంది గాయపడ్డారన్నారు. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం జాతివివక్షతోనే తమ శాంతియుత నిరసనప్రదర్శనపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు.