Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్కలేటర్‌లో చిక్కుకున్న మహిళ మృతి.. సంచలన వీడియో..

ఎస్కలేటర్‌లో చిక్కుకున్న మహిళ మృతి.. సంచలన వీడియో..
, సోమవారం, 27 జులై 2015 (13:27 IST)
చైనాలో తన కుమారుడితో షాపింగ్‌కు వచ్చి ఒక మహిళ ఎస్కలేటర్ యంత్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనలో అదృష్టవశాత్తూ పిల్లాడు ప్రాణాలోతో బయటపడ్డాడు. ఇప్పుడా వీడియో ఇటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ చైనాలోని హిబే ప్రాంతంలో, జింగ్ షివ్ నగర్‌లో 30 ఏళ్ల వయస్సు గల ఒక మహిళ తన చేతి బిడ్డతో వస్తువులను కొనుగోలు చేసేందుకు షాపింగ్ మాల్‌కు వచ్చింది. 
 
ఆ సమయంలో కింద అంతస్థు నుంచి పై అంతస్థుకు వెళ్లేందు కోసం చిన్నారితో ఎస్కలేటర్ ఎక్కారు. అది పై అంతస్థుకు చేరుకుని తర్వాత దాని నుంచి దిగేందుకు యత్నిస్తుండగా అకస్మాత్తుగా ఆ భాగం పగిలిపోయింది. వెంటనే ఆ మహిళ తన బిడ్డను దూరంగా తోసివేసింది. అయితే ఆ మహిళ మాత్రం ఎస్కులేటర్‌ యంత్రంలో చిక్కుకుంది. 
 
దీంతో ఆమె శరీరం నుజ్జునుజ్జై  సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని షాపింగ్ మాల్ సిబ్బంది, అధికారులు ఆ మహిళ మృత దేహాన్ని ఎస్కలేటర్ యంత్రం నుంచి వెలికి తీశారు. ఈ ప్రమాద ఘటన అంతా అక్కడే ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu