Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యా ఓవరాక్షన్.. అప్పుడేమో టాయ్‌లెట్ పేపర్లపై ఒబామా బొమ్మ.. ఇప్పుడేమో మేకపోతుకు?!

రష్యా ఓవరాక్షన్.. అప్పుడేమో టాయ్‌లెట్ పేపర్లపై ఒబామా బొమ్మ.. ఇప్పుడేమో మేకపోతుకు?!
, శుక్రవారం, 27 మే 2016 (18:48 IST)
రష్యాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యా నేతలు ఒబామాను ఏకిపారేస్తున్న నేపథ్యంలో.. ఇటీవల రష్యన్లు ఒబామా ఫోటోలను టాయిలెట్ పేపర్లపై ముద్రించి తమ నిరసన తెలియజేశారు. చాలాకాలంగా అమెరికా అంటేనే రష్యన్లకు ఏమాత్రం గిట్టదు. ఇటీవల 2014 ఉక్రెయిన్ సంక్షోభం నుంచి ఆ కోపం మరింత ఎక్కువైందని విశ్లేషకులు అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఒబామాను రష్యా మరోసారి దారుణంగా అవమానించింది. రష్యాకు మేకకు పేరు పెట్టడం అంటే అత్యంత అవమానకరమైన విషయమట. ఈ తరుణంలో వైల్డ్‌లైఫ్ పార్కులో ఉన్న ఓ నల్లటి మేకపోతుకు ఒబామా అని పేరు పెట్టారు. అమెరికా అంటే ఆ దేశాధ్యక్షుడంటే ఎగిరిపడే రష్యన్లు ఈ విధంగా నల్ల మేకపోతుకు బరాక్ ఒబామా పేరు పెట్టుకుని సంతోషపడుతున్నారట. మరి రష్యన్ల తీరుపై ఒబామా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆకాశం నుంచి చావు జారి పడింది - ప్రపంచం మారిపోయింది': హిరోషిమాలో ఒబామా