Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిహాదీ జాన్‌ను చంపొద్దు.. డేవిడ్ హెయిన్స్ భార్య కోరిక..!

జిహాదీ జాన్‌ను చంపొద్దు.. డేవిడ్ హెయిన్స్ భార్య కోరిక..!
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:41 IST)
నిత్యం ప్రపంచ వ్యాప్తంగా మారణహోమాలు సృష్టిస్తూ వందలాది ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్. ఐఎస్ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాది జిహాదీ జాన్ (మహ్మద్ ఎమ్వాజీ). ఈ ఉగ్రవాది కనిపిస్తే కాల్చిపారేసంతటి కోపంతో ప్రపంచ దేశాలు ఉంటే. అతడి చేతిలో బలైన బ్రిటన్‌కు చెందిన డేవిడ్ హెయిన్స్ భార్య డ్రాగాన్ మాత్రం జిహాదీని చంపొద్దని అంటోంది. 
 
బ్రిటన్కు చెందిన డేవిడ్ హెయిన్స్ భార్య డ్రాగానా హెయిన్. డేవిడ్ హెయిన్స్ జిహాదీ జాన్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అంతేకాదు ఆ హత్య చేసిన వీడియోను కూడా జిహాదీ జాన్ పంపించాడు. దీంతో తీవ్ర ఆవేదనతో ఉన్న ఆమె కొత్తగా జిహాదీ జాన్ అసలు పేరు తెలియడంతో అతడి వల్ల నష్టపోయిన పలు కుటుంబాలు ఇప్పుడు అతడి చావును కోరుకుంటున్నాయి. 
 
జిహాదీ జాన్ను ప్రాణాలతో పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అతడి వల్ల నష్టపోయిన కుటుంబాలకు మీరు మంచి చేసినవాళ్లవుతారు. ఎందుకంటే అతడు సైన్యం దాడుల్లో చనిపోతే గౌరవ మరణాన్ని పొందినట్లవుతాడు. అలా కాకుండా కటకటాల్లో పెట్టి మరణశిక్ష విధించాలి' అని ఆమె ఆక్రోషం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu