Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫుట్‌పాత్ మీద నడిచాడా? లేక బ్రౌన్ నల్లజాతి అమెరికన్ కాబట్టే?

ఫుట్‌పాత్ మీద నడిచాడా? లేక బ్రౌన్ నల్లజాతి అమెరికన్ కాబట్టే?
, శనివారం, 23 ఆగస్టు 2014 (16:06 IST)
ఫుట్‌పాత్ మీద కాక రోడ్డు మీద నడవటమే బ్రౌన్ చేసిన తప్పా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? చదవండి. 18 ఏళ్ల మైఖేల్ బ్రౌన్ అమెరికా పోలీసు తూటాలకు ఈ నెల 9న బలైపోయాడు. ఫుట్‌పాత్ మీద కాకుండా రోడ్డు మీద నడవడంతోనే పోలీసులు కాల్చేశారు. బ్రౌన్ హత్యకు నిరసనగా ఫెర్గ్యూసన్ మండిపోవడంతో పోలీసులు కొత్త కథ చెప్తున్నారు.   
 
దాని ప్రకారం బ్రౌన్‌కు ఒక దొంగతనంతో సంబంధం ఉంది. బ్రౌన్ దొంగే అయినా కాల్చి చంపేసే హక్కు ఏ పోలీసు అధికారికి లేదు. పైగా ‘దొంగ’ చేతులు రెండూ తలపై పెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా ఉండగా కాల్చాల్సిన అవసరం అసలే లేదు.
 
ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా పోలీసు కాల్పులకు కుప్పకూలి గంటల తరబడి అక్కడే పడి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా అవన్నీ జరిగాయంటే బ్రౌన్ నల్ల జాతి అమెరికన్ కాబట్టేనని వార్తలు వస్తున్నాయి. జాత్యహంకారమే బ్రౌన్ ప్రాణాలు తీశాయని సమాచారం. మరి అదన్నమాట.. అమెరికా శ్వేతజాతి పోలీసుల కథ.

Share this Story:

Follow Webdunia telugu