Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా పర్యటనలో చినబాబు.. శాన్ ఫ్రాన్సిస్కో‌లో తెలుగు ప్రజలు ఘన స్వాగతం..!

అమెరికా పర్యటనలో చినబాబు.. శాన్ ఫ్రాన్సిస్కో‌లో తెలుగు ప్రజలు ఘన స్వాగతం..!
, సోమవారం, 4 మే 2015 (09:56 IST)
ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ అమెరికా పర్యాటనకు వెళ్లారు. ఆయన సోమవారం ఉదయం అమెరికా చేరుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
 
లోకేశ్ ఈ పర్యటనలో భాగంగా మే ఏడో తేదిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకు వస్తారని పలువురు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. లోకేష్ మే 12వ తేది వరకు అమెరికా పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu