Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా ఖాకీల అహంకారం.. ఆఫ్రికన్ కాల్చివేత

అమెరికా ఖాకీల అహంకారం.. ఆఫ్రికన్ కాల్చివేత
, బుధవారం, 4 మార్చి 2015 (08:55 IST)
అమెరికా ఖాకీలు పిచ్చిపట్టిన వారిలా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై కనిపించిన విదేశీయుల పట్ల చాలా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ భారతీయ వృద్ధుడిపై దాడి తెగబడిన వారు తాజాగా ఓ ఆఫ్రికన్ ను కాల్చి చంపేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 1న జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
సొంతగూడు కూడా లేని ఓ ఆఫ్రికన్ వ్యక్తిని అమెరికా పోలీసులు చుట్టుముట్టారు. అసలు వారికి ఏం సమాచారం వచ్చిందో తెలియదు. రాగానే పట్టుకున్నారు. పక్కన ఉండేవారు ప్రశ్నించడానికి ప్రయత్నించగా నోరు తెరవద్దంటూ వారిని హెచ్చరించరాు. చుట్టు గుమిగూడి మరీ నడి రోడ్డుపై కాల్చి చంపేశారు. ఎందుకలా చేస్తున్నారని చుట్టుపక్కలవారు అడిగినాకూడా వారిని బెదిరిస్తూ ఏం జరుగుతుందనేది మాత్రమే చూడండని, ప్రశ్నించొద్దంటూ వారిముందే ఆ ఆఫ్రికన్ను చంపేశారు. 
 
ఆ ఆఫ్రికన్ మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నాడని, పోలీసులు వచ్చే సమయానికి తన టెంటు కింద ఎవరితోనో గొడవ పడుతూ ఉన్నాడని చెప్పారు. దొంగతనం కేసును మోపి పోలీసులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. మొత్తం ఐదుగురు పోలీసు అధికారులు ఈ కాల్పులు జరపగా వారిపై చర్యలు తీసుకునేందుకు పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అమెరికా పోలీసుల కావరానికి ఓ అమాయకుడు బలైపోయాడని మానవహక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
 
 

Share this Story:

Follow Webdunia telugu