Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10 వేల డాలర్లు ఇచ్చి పడక గదికి రమ్మన్న డోనాల్డ్ ట్రంప్ : జెసికా డ్రాకే

అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరింతగా వివాదాల సుడిగుండంలో చిక్కుకొన్నారు. మదనతాపం ఎక్కువై ట్రంప్ తమతో విచక్షణా రహితంగా వ్యవహరించినట్టు పలువురు మహిళలు ముందుకు వచ్చి మీడియా

10 వేల డాలర్లు ఇచ్చి పడక గదికి రమ్మన్న డోనాల్డ్ ట్రంప్ : జెసికా డ్రాకే
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (15:07 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరింతగా వివాదాల సుడిగుండంలో చిక్కుకొన్నారు. మదనతాపం ఎక్కువై ట్రంప్ తమతో విచక్షణా రహితంగా వ్యవహరించినట్టు పలువురు మహిళలు ముందుకు వచ్చి మీడియాకు గోడు వెళ్లబోసుకొంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్.. లైంగిక ఆరోపణలతో సతమతమౌతున్నాడు. ట్రంప్ గతంలో నడిపిన అక్రమ శృంగార క్రీడలన్నీ ఇప్పుడు ఆయన మెడకి చుట్టుకుంటున్నాయి. ఆయనపై రోజుకో బూతు ఆరోపణ వస్తోంది. 
 
ఇప్ప‌టికే త‌న ప్ర‌త్య‌ర్ధి హిల్ల‌రీ కంటే ప్ర‌చారంలో వెన‌క బ‌డ్డ ట్రంప్... ఓపెన్ డిబేట్స్‌తో మ‌రింత వెనుకపడ్డాడు. దీంతో తాజా స‌ర్వేల‌న్నీ హిల్ల‌రీ గెలుపుఖాయ‌మ‌ంటున్నాయి. అయినా దూకుడుతో ముందుకెళుతున్న ట్రంప్‌ను, త‌న గ‌త చ‌రిత్ర మరింత ఇరకాటంలో పెడుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌ మ‌హిళ‌ల ప‌ట్ల వ్వ‌వ‌హ‌రించిన తీరు క‌థ‌లు క‌థ‌లుగా వార్త‌ల్లోకి ఎక్క‌డంతో ఇబ్బంది ప‌డుతున్న ట్రంప్‌కు... తాజాగా అమెరికాలో శృంగార చిత్రాల తార‌గా పేరున్న జెసికా డ్రాకే షాక్ ఇచ్చారు. 
 
2006లో డోనాల్డ్ ట్రంప్ తన పట్ల వ్వ‌వ‌హరించిన తీరుని పూస‌గుచ్చిన‌ట్లు వివరించింది. ఒక‌రోజు ట్రంప్ ఆహ్వానం మేరకు మరో ఇద్దరు మహిళలతో ఆయన హోటల్ గదికి వెళ్లానని.. 'మేము వెళ్లేసరికి ట్రంప్ పైజామా దస్తుల్లో ఉన్నారు. దగ్గరికి వచ్చి ఒక్కొక్కరినీ గట్టిగా ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. అంతేకాదు... పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడారు.
 
 అక్కడి నుంచి నా గదికి తిరిగొచ్చాక తాను బసచేసిన హోటల్ గదికి రావాలని మరోసారి ట్రంప్ ఆహ్వానించారని చెప్పింది జెసికా. త‌న‌తో గ‌డ‌ప‌డానికి నీకు ఏం కావాలి, ఎంత కావాలని అడిగారు. ట్రంప్ కోరిక తీర్చడానికి 10 వేల డాల‌ర్లను ట్రంప్ తరపు వ్యక్తి నాకు ఆఫర్ చేశారని తెలిపింది జేసికా. ఒక‌వైపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌వేళ.. త‌న‌ను చుట్టుముడుతున్న శృంగార ఆరోప‌ణ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.... ఈ రోజైనా మీ భర్తను చాలా బాగా సంతోషంతో ముంచేయరూ... ఎందుకంటే...?