Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా న్యాయ శాఖలో భారత సంతతి మహిళ!

అమెరికా న్యాయ శాఖలో భారత సంతతి మహిళ!
, బుధవారం, 22 అక్టోబరు 2014 (18:24 IST)
అమెరికా న్యాయశాఖలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు కీలక బాధ్యతలు కట్టబెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్‌డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టారు. 
 
పెన్సిల్వేనియా వర్సిటీ న్యాయశాఖ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా సాధించిన అనితా సింగ్, సైబర్ ఆధారిత వ్యవహారాల్లో విశేష అనుభవాన్ని గడించారు. జాతీయ భద్రత విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే దిశలో భాగంగా అనితా సింగ్ నియామకాన్ని చేపట్టినట్లు ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ కార్లిన్ చెప్పారు 
 
భవిష్యత్తులో ఆ దేశానికి పలు విభాగాల్లో ఎదురుకానున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాల రచనలో అనితా సింగ్ కీలక భూమిక పోషిస్తారని ఆయన వెల్లడించారు. 2011లో ఎన్ఎస్‌డీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనితా సింగ్, ఏడాదిన్నరగా ఎన్ఎస్‌డీకి యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తూ రాగా, ఈ నియామకంతో ఇకనుంచి పూర్తి స్థాయి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu