Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 500 మంది జలసమాధి!

మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 500 మంది జలసమాధి!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (19:41 IST)
మధ్యధరా సముద్రంలో ఓ భారీ నౌక జలాల్లో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 500 మంది వలస కూలీలు జలసమాధి అయినట్టు భావిస్తున్నారు. సముద్రపు దొంగల దాడి వల్లే ఓడ మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగుగా, తాజాగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్, సూడాన్ దేశాలకు చెందిన సుమారు 500 మంది వలస కూలీలతో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు ఐవోఎం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదం నుంచి బయటపడిన పాలస్తీనాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఐవోఎం ప్రతినిధుల బృందం ముఖాముఖి నిర్వహించింది. సెప్టెంబర్ 6న ఈజిప్టులోని దిమిత్తా పోర్ట్ నుండి తాము బయలుదేరామని, ఓడలో సుమారు 500 మందికి పైగా ఉన్నట్లు వారు తెలిపారని ఐవోఎం తెలిపింది. ఇటీవల జరిగిన ఓడ ప్రమాదాల్లో ఇవి అతి పెద్ద ప్రమాదాలని ఐవోఎం పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu