Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టర్కీ తిరుగుబాటుదారులపై లింగభేదం లేకుండా లైంగిక దాడులు... ఆమ్నెస్టీ సంస్థ వెల్లడి

టర్కీ తిరుగుబాటుదారులపై లింగభేదం లేకుండా లైంగికదాడులు జరుగుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇటీవల టర్కీ ప్రభుత్వాన్ని కూలదోసే చర్యల్లో భాగంగా టర్కీ సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిన వియం

టర్కీ తిరుగుబాటుదారులపై లింగభేదం లేకుండా లైంగిక దాడులు... ఆమ్నెస్టీ సంస్థ వెల్లడి
, సోమవారం, 25 జులై 2016 (14:15 IST)
టర్కీ తిరుగుబాటుదారులపై లింగభేదం లేకుండా లైంగికదాడులు జరుగుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇటీవల టర్కీ ప్రభుత్వాన్ని కూలదోసే చర్యల్లో భాగంగా టర్కీ సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిన వియం తెల్సిందే. వీరికి అనేక మంది న్యాయవాదులు, జడ్జీలు, పోలీసు అధికారులు, సాధారణ పౌరులు కూడా మద్దతిచ్చారు. అయితే, టర్కీ ప్రభుత్వం ఈ తిరుగుబాటును ఉక్కుపాదంతో అణిచివేసింది. ఆ తర్వాత తిరుగుబాటుదారులను బంధించింది. వీరిందరి పట్ల టర్కీ ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తిస్తోందన్నారు. 
 
ముఖ్యంగా.. బందీలుగా తీసుకున్న వారందరికి అహారం అందించకుండా, తీవ్రంగా కొడుతూ.. కొందరిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆమ్నెస్టీ సంస్థ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మానవహక్కులను కాలరాయొద్దని ఆ సంస్థ టర్కీ ప్రభుత్వానికి సూచించింది. 
 
బందీలను తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన విషయాలను టర్కీ ప్రభుత్వం తోసిపుచ్చింది. మానవహక్కులను కాలరాసే పనులను తమ ప్రభుత్వం చేయడంలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. మరోవైపు... టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ నుంచే తరిమేయాలని చూశారు.. మాతృభూమి కంటే పార్టీ గొప్పది కాదు : నవజ్యోత్ సింగ్ సిద్ధూ