Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సఫారీ పార్కు విషాదం: కారు నుంచి దిగిన అమ్మాయి.. నడుము పట్టుకెళ్లి చంపేసిన పెద్దపులి!

చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్‌కు సమీపంలోని సఫారీ పార్కులో తెల్ల పులులుంటాయి. కారు నుంచి దిగకూడదు. కారులో కూర్చునే జూలో తిరగాడాలనే నియమం ఉంది. అప్పటికే పార్కు నుంచి పులి తప్పించుకు

సఫారీ పార్కు విషాదం: కారు నుంచి దిగిన అమ్మాయి.. నడుము పట్టుకెళ్లి చంపేసిన పెద్దపులి!
, సోమవారం, 25 జులై 2016 (10:58 IST)
చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్‌కు సమీపంలోని సఫారీ పార్కులో తెల్ల పులులుంటాయి. కారు నుంచి దిగకూడదు. కారులో కూర్చునే జూలో తిరగాడాలనే నియమం ఉంది. అప్పటికే పార్కు నుంచి పులి తప్పించుకుంది. అక్కడి పార్క్ సిబ్బంది, అధికారులు ఆరా తీస్తున్నారు. కానీ ఓ అమ్మాయి కారు డోర్ తెరుచుకుని దిగింది. కారులో కూర్చున్న వారు ఆమెను లోపలికి రమ్మని పిలిచినా ఏ మాత్రం పట్టించుకోకుండా నిలబడింది. 
 
అంతే ఎక్కడ నుంచో వచ్చేసిన పెద్దపులి ఆమె నడుమును పట్టుకుని లాక్కెళ్లిపోయింది. కారులోంచి ఇతరులు దిగి కాపాడాలనుకున్నా ఫలితం లేకపోయింది. అప్పటికే పెద్దపులి ఆ అమ్మాయిని చంపేసింది. 
 
కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఆ అమ్మాయి... కారు ఆపి డ్రైవింగ్ చేసే వైపు నుంచి మారడానికి దిగి మరో డోర్ తెరిచింది అంతే ఇంతలోనే ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ అమ్మాయిను పులి ఎత్తుకెళ్లి చంపేయగా, కాపాడేందుకు వెళ్లిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ పార్కులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలు జిల్లాలో పరువు హత్య.. భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుందనీ!