Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిషెల్‌ ఒబామాకు చిన్నారి ప్రశ్న: మీ వయసెంత? 51 ఏళ్లా?

మిషెల్‌ ఒబామాకు చిన్నారి ప్రశ్న: మీ వయసెంత? 51 ఏళ్లా?
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (18:37 IST)
అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను ఓ చిన్నారి ఓ ప్రశ్న అడిగింది. అమెరికాలోని శ్వేత సౌధంలో బాలికా విద్యపై జరుగుతున్న సమావేశంలో మిషెల్ ఒబామా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతలో బ్రొడె అనే చిన్నారి, నింపాదిగా మిషెల్ ఒబామాను సమీపించింది.
 
మీ వయసెంత? అని మిషెల్ చెవిలో చిన్నగా అడిగింది. దానికామె 51 ఏళ్లు అంటూ సమాధానమిచ్చింది. అవునా? మరి మీరు చాలా చిన్నగా ఉన్నారేంటి? అని అమాయకంగా ప్రశ్నించింది. చిన్నారి ముద్దు మాటలకు ముచ్చటపడిన మిషెల్ ఒబామా మనస్ఫూర్తిగా పగలబడి నవ్వి చిన్నారిని గుండెలకు హత్తుకున్నారు.
 
ఇంకేముంది.. పిల్లలకు ఏదైనా సందేహం వస్తే ఏదో రూపంలో తప్పకుండా తీర్చుకుంటారు. వారి కల్మషం లేని పలుకులకు ఎవరైనా తలవంచాల్సిందే. అలాంటి అనుభవమే.. మిషెల్ ఒబామాకు వచ్చిందని ఆ సమావేశానికి వచ్చినవారంతా మాట్లాడుకుంటున్నారట.  

Share this Story:

Follow Webdunia telugu