Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను తినను తాగుతాను...! ఓన్లీ జ్యూస్... నమలడమే అతనికి నరకయాతన..!!

నేను తినను తాగుతాను...! ఓన్లీ జ్యూస్... నమలడమే అతనికి నరకయాతన..!!
, మంగళవారం, 30 జూన్ 2015 (21:42 IST)
ఆహారం నమలాలంటే ఇష్టపడని పిల్లాడు ఉంటాడా చెప్పండి. తిండి ఎక్కడ అయిపోతుందోనని కొంచం కొంచం కొరికి నమిలి తినేవారు మనలో చాలామంది ఉన్నారు. అయితే తమాషా ఏమిటంటే ఓ పిల్లాడు తను పుట్టింది మొదలు ఇప్పటివరకూ ఒక ముక్క ఆహార పదార్థాన్ని కూడా అతను కొరికి ఎరుగడు. అతని వయసు ప్రస్తుతం 11 యేళ్ళు.. ఎవరా పిల్లాడు? ఏమా కథ? 
 
నికోలస్ అనే పదకొండేళ్ళ పిల్లాడు కేవలం ద్రవరూపంలో ఉండే ఆహారాన్నే ఇష్టపడతాడు. అంటే  సింపుల్‌గా రోజుకు సుమారురెండు లీటర్ల అరటి పళ్ల జ్యూస్‌‌ను మాత్రమే తీసుకుంటాడు. రోజుకు గ్లాసులకొద్దీ బనానా జ్యూస్ తాగేందుకే ఇష్టపడే నికొలస్ ఇప్పటిదాకా ఎటువంటి ఘన పదార్థాన్ని నోట్లో పెట్టుకోనేలేదట ! విచిత్రమేమిటంటే నికోలస్ ఇప్పటిదాకా ఎటువంటి అనారోగ్యానికి గురవ్వలేదు. 
 
ఎటువంటి ఆహారాన్ని నికొలస్ ఇప్పటిదాకా నమలకపోవడంతో అతనికి ఆహారాన్ని ఎలా నమిలి తినాలో కూడా తెలియదట. రోజుకు లీటర్ల కొద్దీ మిల్క్‌‌‌‌‌షేక్‌‌లు, బనానా జ్యూస్ తాగడం వల్ల నికోలస్ ఒంట్లో రోజుకు 2,800  కాలరీలు పేరుకుపోతున్నాయి. పైగా ఆ కుర్రాడు తీసుకునే ఆహారంతో అతని శరీరంలోకి  రోజుకు 98 టీస్పూన్ల చక్కెరతోబాటు పాలల్లో ఉండే చక్కెర కూడా చేరుతోందని తెలుస్తోంది.  
 
గత రెండేళ్ల నుంచి అయితే  మిల్క్‌షేక్ ,జ్యూస్‌లు తప్ప మరో ఆహారం మాటెత్తని నికోలస్‌కు కేక్స్ అంటే చాలా ఇష్టమే కానీ.. వాటి జోలికి మాత్రం పోడు. ఫ్యామిలీ మెంబర్స్‌‌‌తో రెస్టారెంట్‌కు వెళ్లినా ఎటువంటి ఫుడ్డు ఆర్డర్ చేయడని, ఒట్టి మంచినీళ్లు తెప్పించుకుని స్ట్రాతో తాగుతూ టైం పాస్ చేస్తాడని అతని పేరెంట్స్ చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu